'శ్రీకాంత్ నాకు స్నేహితుడు మాత్రమే..'
విజయవాడ: కాల్మనీ కేసులో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్తో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పారు. శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని తెలిపారు.
కాల్మనీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు వచ్చిన వార్తలను బోడె ప్రసాద్ ఖండించారు. ప్రస్తుతం తానే అప్పుల్లో ఉన్నానని చెప్పారు. తాను మరొకరికి డబ్బులిచ్చే పరిస్థితి ఉంటే అప్పులెందుకు చేస్తానని బోడె ప్రసాద్ అన్నారు.