డివిజన్ స్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక
Published Fri, Sep 2 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
భువనగిరి అర్బన్ : మండల స్థాయి క్రీడ పోటీల్లో గెలుపొందిన అనంతారం పాఠశాలలోని విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీఈటీ మల్లేశం తెలిపారు. శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామంలోని పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్–14 వాలీబాల్‌లో బాలికలు ప్ర«థమ, బాలురు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని డివిజన్ స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు చెప్పారు. అలాగే అండర్–17 బాలుర వాలీబాల్‌లో ఎ.ప్రేమ్‌కుమార్, వి.సుభాష్‌చంద్రబోస్, బాలకల విభాగంలో ఎం.శ్రావణి, కె.పూజిత, వి.ఇందు, జి.లహరి, టి.గౌతమి, అండర్–14 బాలుర విభాగంలో ఎ.తిలక్, బి.మధు, పి.సాయికుమార్, బాలకల విభాగంలో జి.శ్రీలత, శ్రావణి, ఇ.సుస్మిత, పి.రేణుక, కె.మనీషా విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వీరిని గ్రామ సర్పంచ్ విఠల రాఘురామయ్య, ఎంపీటీసీ శంకరయ్య, ఉప సర్పంచ్ ఒగ్గు శివకుమార్, పాఠశాల హెచ్‌ఎం జి.విజయ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Advertisement