నాలుగురోజుల క్రితం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొమ్మల రామారం గ్రామానికి చెందిన సుమన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
నల్లగొండ: నాలుగురోజుల క్రితం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొమ్మల రామారం గ్రామానికి చెందిన సుమన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సుమన్ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలుడు ఉన్నడని విషయం తెలియడంతో... అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల చెరలో ఉన్న సుమన్ని పోలీసులు విడిపించారు. ఈ రోజు నిందితులను భువనగిరి పోలీస్‌స్టేషన్కు తీసుకువచ్చారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల నుంచి ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.