కోన కణ్వాశ్రమం చూసొద్దాం.. రండి
చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న కోన కణ్వాశ్రమం ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్యన పురాతన ఆలయాలను ఇక్కడ చూడవచ్చు. జాతీయ రహదారి నుంచి దాదాపు ఐదు కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం లోపలకు వెళితే కణ్వ మహర్షి తపమాచరించిన ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతాన్నే కోన కణ్వాశ్రమమని భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామి, రుక్మిణి సమేత పాండురంగ విఠలుడి ఆలయాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. శివకేశవులు కొలువైన క్షేత్రంగానూ ఈ ప్రాంతానికి పేరుంది.
ఇంకా అయ్యప్పస్వామి, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర, అక్క మహా దేవతల ఆలయాలూ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే.. మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై 45 కిలో మీటర్ల ప్రయాణించి చెన్నేకొత్తపల్లి చేరుకుంటే ఇక్కడి నుంచి ఆటోల ద్వారా జాతీయ రహదారిపై పెనుకొండ మార్గంలో రెండు కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుంచి కుడివైపుగా ఐదు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించి కోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇక్క పర్యాటకులు విడిది చేసేందుకు చక్కటి వసతి సౌకర్యం కూడా
- చెన్నేకొత్తపల్లి (రాప్తాడు)