ములకనూరు.. చూసొద్దాం రండి | summer special of mulakanuru thimmappaswamy | Sakshi
Sakshi News home page

ములకనూరు.. చూసొద్దాం రండి

Published Fri, May 12 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ములకనూరు.. చూసొద్దాం రండి

ములకనూరు.. చూసొద్దాం రండి

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కంబదూరు మండలంలోని ములకనూరు గ్రామంలోని కొండపై వెలసిన తిమ్మప్పస్వామి ఆలయంలో ప్రతి ఏటా జాతర వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ ఇక్కడ జాతర జరుగుతోంది. గ్రామాల్లో జాతరలంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. 16వ తేదీ ఉదయం దాసంగాలు పెడతారు.

అదే రోజు రాత్రి స్వామికి పల్లకీ ఉత్సవం, ముత్యాల తేరు ఊరేగింపు ఉంటుంది. 17వ తేదీ గ్రామ నడిబొడ్డున గావుల ఉత్సవం ఉంటుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామి జాతర ఉంటుంది. ఇక ఈ జాతరలో ప్రత్యేకాకర్షణగా 16వ తేదీ రాతిదూలం లాగుడు పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ జాతర చూసేందుకు మీరందరూ మా ఊరికి రండి..
- కంబదూరు (కళ్యాణదుర్గం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement