కాపుకులస్థుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టడాన్ని గురువారం గుంటూరు కాపునేతలు తీవ్రంగా ఖండించారు.
-ముద్రగడ దీక్షకు గుంటూరు నేతల మద్దతు
గుంటూరు
కాపుకులస్థుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంపై కేసులు పెట్టడాన్ని గురువారం గుంటూరు కాపునేతలు తీవ్రంగా ఖండించారు. దీక్ష చేస్తున్న ముద్రగడకు ఏమైన జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాపునేతలు గోవిందు, శంకరశ్రీనివాస్,కమలేంద్ర, వెంకటకోటి, శివనాగేశ్వరరావులు ప్రభుత్వన్ని హెచ్చరించారు. ముద్రగడ దీక్షకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎన్నికలప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముద్రగడను అరెస్టు చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న కాపునేతలు ముద్రగడపై విమర్శలు మానుకోవాలన్నారు. కాపు హక్కుల కోసం సంఘిటతం కావాలన్నారు.