సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్రా శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్రా శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయనతోపాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్, స్థానిక జడ్జి శేషాద్రి కూడా స్వామిని దర్శించుకున్నారు.