24 నాటికి సర్వే పూర్తికావాలి
Published Wed, Oct 19 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
ఏలూరు (మెట్రో)
జిల్లాలో ప్రజాసాధికారిత సర్వేలో ప్రజల వివరాలను ఈనెల 24వ తేదీ సాయంత్రంలోగా నూరు శాతం నమోదు పూర్తికావాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని సబ్‌కలెక్టర్లు, ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారిత సర్వేలో జిల్లాలో ఇంకా సుమారు 5లక్షల 50వేల మంది డేటాను నమోదు చేయాల్సి ఉందనీ, అందులో 4లక్షల 50వేల మంది అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారన్నారు. ఈనెల 24వ తేదీ ఆఖరు తేదీ అయినందున 24వ తేదీ సాయంత్రంలోగా నూరుశాతం డేటా నమోదు పూర్తి చేయాలని లేకుంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నిలుపుదల అయి ఆపై ఎవరి డేటాను నమోదు చేయడానికి వీలు పడదన్నారు. జిల్లాలో ఏ ఒక్క కు9టుంబం ఏ ఒక్క వ్యక్తి డేటా నమోదు కాకుండా మిగిలిపోయినా దీనికి కారణమైన సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాలి9స ఉంటుందని అటువంటిఒ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజాధికారిత సర్వే వల్ల భవిష్యత్‌లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ అభివద్ధి ఫలాలు సులభతరంగా అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్‌పి సిఇఒ డి.సత్యనారాయణ, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీనివాసులు, ఐసిడిఎస్ పీడీ చంద్రశేఖర్, ఎన్‌ఐసి అధికారి శర్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement