పదిరోజుల్లో ప్రజాసాధికారిత సర్వే పూర్తి
Published Fri, Oct 14 2016 7:12 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రజా సాధికారిత సర్వేను పదిరోజుల్లో పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి తెలిపారు. విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికారిత సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ భాస్కర్ జిల్లా ప్రజాసాధికారిత సర్వే వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 39లక్షల జనాభా ఉండగా వారిలో 5.60లక్షల మంది సర్వేను పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీరిలో నెట్‌వర్క్ అందుబాటులో లేని ఏజన్సీ ప్రాంతంలో 2లక్షల మంది వరకూ ఉన్నారన్నారు. నెట్‌వర్కులేని ఇంటువంటి ప్రాంతాల్లో సర్వే నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన యాప్ అందిన వెంటనే వారం పదిరోజుల్లో ప్రజాసాధికారిత సర్వేను పూర్తి చేస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షా 60వేల మందికి సంబంధించి సమాచారం అందుబాటులో లేదన్నారు. వీరిలో కొంత మంది స్థానకంగా లేకపోవడం, వలస వెళ్లడం వంటివి ఉన్నాయన్నారు. అదే విధంగా జిల్లాలో జిరో నుండి 6 సంవత్సరాల వయస్సు కలిగిన 55వేల మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేశామని వివరించారు. ఆరోగ్య, ఐసిడిఎస్‌రికార్డులను క్రోడీకరించుకుని ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. దీని ఆధారంగా పిల్లలకు ఇమ్యునైజేషన్ సరైన క్రమంలో ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంబంధిత జిల్లా వాసులకు సమాచారం పంపి వారి వివరాలను సర్వేలో పొందుపరచాలన్నారు. అదే విధంగా రాష్ట్రం వెలుపల ఉంటే అటువంటి వారి వివరాలను నమోదు చేసుకునేందుకు ఒకటి రెండు నెలలు సమయం నిరే్ధశించాలన్నారు. దీని కోసం ఆయా కుటుంబాల నుండి అందుబాటులో లేని కుటుంబ సభ్యుల సమాచారాన్ని పొందాలని ముఖ్యమంత్రి కలెక్టర్ భాస్కర్‌కు సూచించారు. ప్రజాసా«ధికారిత సర్వే నిర్వహణ, ఆన్‌లైన్‌లో పొందు పరిచే విషయంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement