మా బాబాయి మృతి మిస్టరీని ఛేదించండి
మతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు
ఫిరంగిపురం : తన బాబాయి అనుమానాస్పదంగా మతి చెందాడని, కొందరిపై అనుమానం వుందని జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు డేగల రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన మండలంలో చర్చనీయంగా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 113 తాళ్ళూరు గ్రామానికి చెందిన డేగల రామకష్ణ (65) ఈనెల 19న అనారోగ్య కారణంగా మృతి చెందాడు. కోడలు నాగేశ్వరమ్మ, వారి బంధువు డేగల తిరుమలరావు కారణంగానే మృతి చెందాడని, దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని కోరుతో రామకృష్ణ సోదరుడి కుమారుడైన రవిబాబు మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహం వెలికితీత..
ఈ క్రమంలో బుధవారం తహసీల్దారు జే.పార్ధసారధి ఆధ్వర్యంలో రామకృష్ణ, మృతదేహాన్ని వెలికి తీశారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్ అంకినీడు ప్రసాద్, సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వారి నివేదిక ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని ఎసై ్స ఆనందరావు తెలిపారు. ఇదిలా వుంటే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న విషయం గ్రామంలో తెలియడంతో తండోపతండాలుగా తరలివచ్చి ఉత్కంఠగా చూస్తూండిపోయారు.
పోలీసుల అదుపులో..
అధికార పార్టీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేయడంతో ఆఘమేగాల మీద తిరుమలరావును మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు అత్యుత్సాహం చూపారని గ్రామస్తులు అంటున్నారు. అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు.