mistary
-
ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అనుమానస్పద మృతి
శంషాబాద్ : ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ఉద్యోగి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన శంషాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జోసెఫ్(28) ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌లైన్స్‌లో ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. తోటి ఉద్యోగులతో కలిసి పట్టణంలోని మధురానగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడికి ఫోన్ చేసి తాళం చెవి తీసుకుని గదికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నాలుగో అంతస్థు నుంచి జోసఫ్ కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తోటి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. జోసఫ్ కిందపడి మృతిచెందిన సమయంలో అతడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరితోనైనా ఘర్షణ పడ్డాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
కెన్నెడీ హత్య ఎలా జరిగింది?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రోతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలను అంతమొందించేందుకు సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పన్నిన కుట్రకు సంబంధించినవి సహా మొత్తం 3వేల రహస్య పత్రాలను అమెరికా శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్య తర్వాత హంతకుడిని పట్టుకునేందుకు విచారణ సంస్థలు ఆధారాల కోసం వెతికిన తీరు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై వస్తున్న పుకార్లను తాజా వివరాలు వెల్లడించాయి. కెన్నెడీని ఓస్వాల్డ్ అనే అమెరికా నౌకాదళ సభ్యుడు హతమార్చాడని అప్పటి ఏజెన్సీలు పేర్కొన్నప్పటికీ దీని వెనక భారీ కుట్ర దాగి ఉందని ఇప్పటికీ అమెరికన్లు భావిస్తున్నారు. 2018, ఏప్రిల్ 26 లోపల కెన్నెడీ హత్యలోని మరిన్ని ఆసక్తికర అంశాలను విడుదల చేయనున్నట్లు వైట్ హౌజ్ పేర్కొంది. క్యాస్ట్రోను హతమార్చేందుకు సీఐఏ పాత్ర గురించి తాజా పత్రాల్లో వెల్లడైంది. క్యూబాను హస్తగతం చేసుకోవటం కోసం చేసిన కుట్రకోణాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్యకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే ఈ వివరాలు వెల్లడించినట్లు నేషనల్ ఆర్కైవ్స్ పేర్కొంది. క్యాస్ట్రోను చంపించేందుకు.. ‘ఫిడేల్ క్యాస్ట్రోను అంతమొందించాలని సీఐఏ ప్రయత్నించింది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే’ అని తాజా నివేదికలు పేర్కొన్నాయి. ‘క్యాస్ట్రో’ పేరుతో ఉన్న 1975 నాటి ఓ డాక్యుమెంట్లో.. క్యూబా పీఠం నుంచి క్యాస్ట్రోను తప్పించేలా అమెరికా ప్రభుత్వం 1960ల్లో చేసిన ప్రయత్నాలున్నాయి. ఆపరేషన్ బౌంటీ పేరుతో గ్యాంగ్స్టర్ల సాయంతో లేదా మిలటరీ ఆపరేషన్తోనైనా క్యూబాపై పట్టు సంపాదించాలని అమెరికా కుట్రపన్నినట్లు వెల్లడైంది. క్యాస్ట్రో ప్రభుత్వంలోని అధికారులు, ముఖ్యమైన నాయకులను హతమార్చేందుకు.. రెండు సెంట్ల (0.16 డాలర్లు) నుంచి మిలియన్ డాలర్ల వరకు ఒక్కొక్కరి కి ఒక్కో రేటును నిర్ణయించింది. ఈ వివరాలున్న కరప త్రాల్ని విమానం ద్వారా క్యూబా అంతటా వదిలిపెట్టాలని కూడా అమెరికా ప్రణాళికలు రూపొందించింది. తద్వారా క్యూబన్లే క్యాస్ట్రోను, అతని అనుచరులను చంపేందుకు ప్రోత్సహించాలని భావించింది. తమ పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా అధ్యక్షుడి అడ్డు తప్పించేందుకు అమెరికా అత్యంత తక్కువ మొత్తాన్ని ఎరగా వేసింది. కెన్నెడీ హత్యకు ముందు.. క్యూబాలో కమ్యూనిజాన్ని అంతమొందించేందుకు ‘ఆపరేషన్ ముంగూస్’ ప్రణాళికలనూ 1962నాటి జాతీయ భద్రత మండలి దస్తావేజులు స్పష్టం చేశాయి. ‘సీఐఏ.. గ్యాంగ్‌స్టర్ సామ్ జియంకానా మధ్యవర్తిత్వంతో క్యాస్ట్రోను హతమార్చేందుకు ఓ షూటర్‌తో లక్షన్నర డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది’ అని అధ్యక్షుడు కెన్నెడీ సోదరుడు, అప్పటి అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నడీ ఎఫ్‌బీఐకి వెల్లడించినట్లు ఈ నివేదిక పేర్కొంది. కెన్నెడీ హత్య వెనక జాన్ ఎఫ్ కెన్నెడీ హంతకుడు లీ హార్వీ ఓస్వాల్డ్ నుంచి హత్యకు కొద్దిరోజుల ముందు ఎఫ్‌బీఐకి బెదిరింపు సందేశం వచ్చినట్లు ఈ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఓస్వాల్డ్కు విదేశీ (రష్యా, క్యూబా) ఇంటెలిజెన్స్ సంస్థలతో సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ పేర్కొన్నట్లుగా రిపోర్టుల్లో ఉంది. 1963 మార్చి నుంచి డిసెంబర్ వరకు సంపాదించిన జాబితా ప్రకారం ప్యుర్టోరికన్లు, గ్యాంగ్స్టర్లు, మానసిక ఆరోగ్యం సరిగా లేనివాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని ఎఫ్‌బీఐ భావించింది. కెన్నెడీ హత్యకు పదిరోజుల ముందు రాబర్ట్ సీ రాల్స్ అనే వ్యక్తి 100డాలర్ల బెట్టింగ్ పెట్టారని ఆయన్ను సీక్రెట్ సర్వీస్ విచారించిందని వెల్లడైంది. బార్లో ఓ వ్యక్తి కెన్నెడీ హత్య గురించి మాట్లాడుతుండగా విన్నానని.. అయితే చీకట్లో, మద్యం మత్తులో అతని ముఖం చూడలేదని రాల్స్ వెల్లడించారు. కెన్నెడీ హత్యకు కొద్ది ముందు.. జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు కొద్ది సేపటిముందు ‘కేంబ్రిడ్జ్ న్యూస్’ అనే బ్రిటీష్ పత్రికకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని.. అమెరికాకు సంబంధించి పెద్ద వార్త రాబోతోందనే సందేశాన్నిచ్చిందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 1969 నవంబర్ 26న ఎఫ్‌బీఐకి సీఐఏ రాసిన రాసిన లేఖలో ఈ వివరాలున్నాయి. ‘కేంబ్రిడ్జ్ న్యూస్ రిపోర్టర్ లండన్‌లోని అమెరికన్ ఎంబసీకి ఈ విషయాలని తెలపాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు’ అని నివేదిక పేర్కొంది. బ్రిటన్ ఎమ్ఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వివరాల ప్రకారం హత్యకు 25 నిమిషాల ముందు ఈ కాల్ వచ్చినట్లు తెలిసింది. కాల్ అందుకున్న రిపోర్టర్ మంచివాడని.. ఎలాంటి నేర చరిత్ర లేదని ఎమ్ఐ5 ధ్రువీకరించింది. ట్రంప్ ఆదేశాలతోనే.. 1963, నవంబర్ 22న డాలస్‌లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 2,891 రికార్డులను విడుదల చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో నేషనల్ ఆర్కైవ్స్ వీటిని బహిర్గతం చేసింది. అయితే భద్రత ఏజెన్సీల విన్నపం మేరకు పలు పత్రాలను విడుదల చేయకుండా ఉండేందుకు ట్రంప్ అంగీకరించారు. ‘రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, చట్ట బద్ధ సంస్థలకు నష్టం జరగకుండా కాపాడేందుకు, విదేశీ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పలు వివరాలు వెల్లడి చేయకుండా తాత్కాలిక నిషేధం విధించాం’ అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో కీలకమైన కెన్నెడీ హత్య గురించి ప్రజలకు అన్ని వివరాలు తెలియాలనే ఉద్దేశంతోనే వీటిని బహిర్గత పరిచామని ఆయన తెలిపారు. ‘ఏజెన్సీలు పారదర్శకంగా పనిచేయాలని.. ఆలస్యం చేయకుండా ఈ నివేదికల్లో స్వల్పమైన మార్పులు మాత్రమే చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సరా శాండర్స్ తెలిపారు. -
మా బాబాయి మృతి మిస్టరీని ఛేదించండి
మతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఫిరంగిపురం : తన బాబాయి అనుమానాస్పదంగా మతి చెందాడని, కొందరిపై అనుమానం వుందని జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు డేగల రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన మండలంలో చర్చనీయంగా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 113 తాళ్ళూరు గ్రామానికి చెందిన డేగల రామకష్ణ (65) ఈనెల 19న అనారోగ్య కారణంగా మృతి చెందాడు. కోడలు నాగేశ్వరమ్మ, వారి బంధువు డేగల తిరుమలరావు కారణంగానే మృతి చెందాడని, దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని కోరుతో రామకృష్ణ సోదరుడి కుమారుడైన రవిబాబు మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం వెలికితీత.. ఈ క్రమంలో బుధవారం తహసీల్దారు జే.పార్ధసారధి ఆధ్వర్యంలో రామకృష్ణ, మృతదేహాన్ని వెలికి తీశారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్ అంకినీడు ప్రసాద్, సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వారి నివేదిక ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని ఎసై ్స ఆనందరావు తెలిపారు. ఇదిలా వుంటే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న విషయం గ్రామంలో తెలియడంతో తండోపతండాలుగా తరలివచ్చి ఉత్కంఠగా చూస్తూండిపోయారు. పోలీసుల అదుపులో.. అధికార పార్టీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేయడంతో ఆఘమేగాల మీద తిరుమలరావును మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు అత్యుత్సాహం చూపారని గ్రామస్తులు అంటున్నారు. అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు. -
వీడని ఉత్కంఠ
ఎవరై ఉంటారబ్బా ..? ఎక్కడ చూసినా చర్చోపచర్చలు అధికారపార్టీ నేతలపైనే అనుమానం నయీమ్ కేసులో పెదవి విప్పని పోలీస్‌లు భువనగిరి : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి నెలరోజులు కావస్తున్నా కేసులో ఉత్కంఠ వీడడం లేదు. నయీమ్‌తో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే వారెవరై ఉంటారని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆగస్టు నెల 8వ తేదీన గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్దపోలీస్ల ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ అనంతరం అతని ఇళ్లలో జరిపిన సోదాల్లో నేర సమాచారంతో కూడిన డైరీ, వందలాది డాక్యుమెంట్లు, బంగారం, ఆభరణాలు, దుస్తులు. చీరలు, కోట్లాది రూపాయల నగదు దొరికిన విషయం తెలిసిందే. నయీమ్ ఎన్‌కౌంటర్‌తో వెలుగు చూసిన పలు కేసులతో స్పందించిన ప్రభుత్వం నయీమ్ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిట్ దర్యాప్తు సంస్థను నియమించింది. సిట్, స్థానిక పోలీస్‌లు సమన్వయంతో జరిపిన వరుసదాడులతో నయీమ్ అనుచరులను ఊపిరి సలుపుకోనివ్వలేదు. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసింది.ముందుగా అతని కుటుంబసభ్యులు, ప్ర«ధాన అనచరులను వెంట వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం ద్వారా బాధితులకు ధైర్యం కలిగించడంతో రాష్ట్ర వ్యాపితంగా అతని అగడాలు ఒక్కోక్కటిగా వెలుగు చూశాయి. సిట్ 62 కేసులు నమోదు చేసింది. మరి కొందరిపై నమోదు చేసి విచారణ జరుపుతోంది. జిల్లాను కుదిపేసిన ఎన్కౌంటర్ గ్యాంగ్‌స్టర్ నయిమ్ స్వస్థలం భువనగిరి కాగా, మిర్యాలగూడ అత్తవారిళ్లు కావడంతో జిల్లాలో అతని నేరసామ్రాజ్యం వేర్లు నలుదిక్కులా విస్తరించిన విషయం వెలుగుచూస్తోంది. అతని నేరసామ్రాజ్యంలో ఉన్నత స్థాయి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు పోలీస్ ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రముఖులు ఉండడం విశేషం. నయీమ్‌తో జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాలో సుమారు 35 మంది వరకు నయీమ్ అనుచరులు,కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి వివిధ కేసుల్లో జైలుకు పంపించారు. ప్రధానంగా నయీమ్ ముఖ్య అనుచరుడు భువనగిరికి చెందిన పాశం శ్రీను, జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్‌లపై పీడీ యాక్టు నమోదు చేసి వరంగల్జైలుకు తరలించగా, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేష్‌యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ నాసర్లతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరికొందరిపై కేసులు నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీస్‌లు జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులు విచారించారు. అతను అప్రువర్‌గా మారి నయీమ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,పోలీస్ అధికారులు, ఇతర ముఖ్యులకు ఉన్న లింకులను వివరించినట్లు సమాచారం. ఇప్పటికే నయీమ్ డెన్‌లో లభించిన ఫొటోలు, సెల్ఫోన్సంభాషణల రికార్డులు, డైరీలో లభించిన వివరాలకు పాశం శ్రీను చెప్పిన వివరాలను పోల్చి చూస్తున్న సిట్ అధికారులు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సిట్అధికారులు భువనగిరి, పరిసర ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లుగా మీడియాలో వరుస కథనాలు వస్తున్నా సిట్ అధికారులు, పోలీస్‌లు నోరువిప్పడం లేదు. దీంతో నయీమ్ ఎపిసోడ్లో కేసులు నమోదు అయిన నాయకులెవరన్న సస్పెన్స్‌పై జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జిల్లాలో పలువురు ముఖ్యనేతల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు ఎవరికి వారు నరాలు తెగె ఉత్కంఠతను అనుభవిస్తున్నారు. పేరున్న నాయకులపై కేసులు నమోదు అయ్యాయని, వారంతా పోలీస్‌లకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్నారని, కేసుల నుంచి బయటపడడానికి ఉన్నత స్థాయిలో పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే కేసులు నమోదు అయిన కొందరిని సిట్ పోలీస్‌లు అదుపులోకి అజ్ఞాతంలో విచారిస్తున్నారంటూ ఎక్కడి కక్కడ తీవ్రంగా చర్చించుకుంటున్నారు.అయితే అరెస్ట్ అయిన నాయకులు ఎవరై ఉంటారోనని పలువురు పేరున్న నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నయీమ్ కేసులో ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు, స్థానిక ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పటి వరకు పేరున్న నాయకుల జోలికి పోలేదు. సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నయీమ్ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని చేస్తున్న హెచ్చరికలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచిచూడాల్సి ఉంది. పదుల సంఖ్యలో ఫిర్యాదులు నయీమ్, అతని అనుచరులు తమను చంపుతామనిబెదిరించి భూములను,ప్లాట్లను బలవంతంగా లాక్కున్నారని, లక్షలాది రూపాయలు వసూలు చేశారని పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ అధికారులతో పాటు, సిట్ దర్యాప్తు సంస్థకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.