జాతీయస్థాయి చెస్ పోటీలకు శ్వేత
కలగంపూడి (యలమంచిలి ) : జాతీయస్థాయి చెస్ పోటీలకు గ్రామానికి చెందిన గుంటూరు శ్వేత ఎంపికైంది. ఈ నెల 24, 25 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన అండర్–19 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో శ్వేత ప్రతిభ చూపినట్టు ఆమె తల్లిదండ్రులు పద్మావతి, శ్రీనివాసరాజు చెప్పారు. శ్వేత ప్రస్తుతం నరసాపురం ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. మంగళవారం స్థానిక అల్లూరి సీతారామరాజు క్షత్రియ యువజన సంఘం సభ్యులు శ్వేతను సన్మానించారు. సర్పంచ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు తదితరులు ఆమెను అభినందించారు.