మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి.
కూడేరు : మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి టెంకాయ కొట్టమని కూడేరు సర్పంచ్ ఓబుళపతిని ఆ పార్టీ బీసీ సెల్ మాజీ జిల్లా కార్యదర్శి బాస్కర్‌గౌడ్, మరి కొందరు సూచించారు. దీనిపై తెలుగు యువత జిల్లా కార్యదర్శి కుసాల నాగరాజు అభ్యంతరం తెలిపారు.
దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కుసాలు నాగరాజు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధం కాగా భాస్కర్ గౌడ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. వెంటనే నాయకులు కల్పించుకొని వారిని శాంతింపచేశారు.