టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం | TDP MLA Velagapudi Rama krishna babu throws file at IAS officer | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం

Published Tue, Oct 6 2015 9:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం

 సచివాలయంలో ముఖ్య కార్యదర్శిపై చిందులు

 సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. ఉన్నతాధికారిపై చిందులు వేశారు. నాకే అపాయింట్‌మెంట్ ఇవ్వరా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అధికారి చాంబర్ వద్ద గ్లాసు పగులగొట్టారు. ఫైళ్లను విసిరికొట్టారు. సచివాలయంలోని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేషీలో జరిగిన ఈ ఘటన ఆ పేషీ అధికారులనే కాదు ఇతర ఉద్యోగులు, సిబ్బందినీ, సచివాలయానికి పనిపై వచ్చినవారినీ విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే... తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సోమవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు.

అయితే వలవన్ అప్పుడు అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఇళ్ల నిర్మాణానికి గాను 10 ఎకరాల స్థలం కేటాయింపు విషయమై చర్చించడానికి పేషీకి వచ్చిన వెలగపూడి సుమారు గంటసేపు అక్కడ వేచిచూశారు. ఎంతకీ అధికారి నుంచి పిలుపురాకపోవడంతో ఎమ్మెల్యే ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే ఆవేశం చూసి పేషీ సిబ్బంది భయకంపితులయ్యారు. తర్వాత ఎమ్మెల్యే తలుపులు తోసుకుని ఉన్నతాధికారి సమావేశం గదిలోకి వెళ్లి ఆయన్నుద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. సంయమనంతో వ్యవహరించిన వలవన్.. ఎమ్మెల్యే వెలగపూడికి నచ్చజెప్పి, ఫైలుకు సంబంధించిన సమాధానం చెప్పి పంపించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement