ఆలయాల అభివృద్ధికి కృషి
ఆలయాల అభివృద్ధికి కృషి
Published Sun, Sep 4 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
నెల్లూరు రూరల్: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దచెరుకూరు, అల్లీపురంలోని వివిధ ఆలయాల ధర్మకర్తల పాలకమండళ్ల సభ్యుల ప్రమాణస్వీకారాన్ని అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దచెరుకూరులోని రామాలయం, శివాలయం, అల్లీపురం సీతారామాలయం, వీరాంజనేయ స్వామి ఆలయాలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేశామని వివరించారు. నవాబుపేట నుంచి గుడిపల్లిపాడు వరకు రెండు లేన్ల రోడ్డు అభివృద్ధికి రూ.10 కోట్లను కేటాయించామని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ పనులను వేగవంతం చేసిందని, పెన్నా బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని వివరించారు. అనంతరం మాజీ మంత్రి, టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. సోమిరెడ్డి నాయకత్వంలో అల్లీపురం, పెద్దచెరుకూరు గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. ఈ ప్రాంతంలోని చెత్తడంపింగ్ యార్డు, రైస్‌మిల్లులను తొలగించి, రింగ్‌రోడ్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని చెప్పారు. మైపాడు బీచ్ వరకు రోడ్డును అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు. విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కోడూరు కమలాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రెడ్డి, కార్పొరేటర్ మేకల రామ్మూర్తి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి, అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ బండి శ్రీకుమార్‌రెడ్డి, రామమందిర చైర్మన్ శివశంకర్‌రెడ్డి, పెద్దచెరుకూరు శివాలయ చైర్మన్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామాలయ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement