ప్రేమించకపోతే యాసిడ్‌ పోస్తా | Tenth threats to student | Sakshi
Sakshi News home page

ప్రేమించకపోతే యాసిడ్‌ పోస్తా

Published Fri, Mar 24 2017 2:35 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

ప్రేమించకపోతే యాసిడ్‌ పోస్తా - Sakshi

ప్రేమించకపోతే యాసిడ్‌ పోస్తా

టెన్త్‌ విద్యార్థినికి బెదిరింపులు

సీతంపేట (విశాఖ ఉత్తరం) : మొదటి సారి నిన్ను చూడగానే ఫ్లాట్‌ అయిపోయాను, నిన్ను లవ్‌ చేయాలని డిసైడ్‌ అయిపోయాను. ను వ్వు కూడా నన్ను లవ్‌ చేయాలి, లేకుంటే యాసిడ్‌ పోస్తా... అంటూ టెన్త్‌ క్లాస్‌ విద్యార్థి తనతోపాటు పరీక్ష రాస్తున్న విద్యార్థినిని వేధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే న్యూరేసపువానిపాలెంకు చెందిన  పదో తరగతి విద్యార్థి సీతంపేట రాజేంద్రనగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అలాగే శివాజీపాలెంకు చెందిన అమ్మాయి ఎంవీపీ కాలనీలోని ప్రైవేటు స్కూల్‌లో టెన్త్‌ చదువుతోంది. జంబ్లింగ్‌ సిస్టం కావడంతో వీరిద్దరూ సీతంపేట మధురానగర్‌లోని జీవీఎంసీ  హైస్కూల్‌లో టెన్త్‌ పరీక్షలు రాయడానికి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే రూమ్‌లో ముం దు వెనకా కూర్చున్నారు.

పరీక్షలు ప్రా రంభం నుంచి అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు.  దీంతో పరీక్ష రాయనివ్వకుండా డిస్టర్బ్‌ చేస్తున్నాడని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో , అబ్బాయిని మందలించి వదిలేశారు.  నాల్గవ రోజు ఎడమ చేతిపై కోసుకున్న గాయాలు చూపించి, ఇదంతా నీకోసమేనన్నాడు. లవ్‌  చేయకుంటే యాసిడ్‌పోస్తానని బెదిరించడంతో అమ్మాయి భయపడిపోయింది. తిరిగి ఇన్విజిలేటర్లకు, తను చదువుతున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్కూల్‌ ప్రిన్సిపాల్, అమ్మాయి తల్లిదండ్రులు బుధవారం పరీక్షా కేంద్రానికి వచ్చారు. మా అమ్మాయిని బెదిరిస్తున్నాడని పరీక్ష కేంద్రం ఇన్‌చార్జి దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు విషయాన్ని ద్వారకా పోలీస్‌స్టేషన్‌ సీఐకు వివరించారు.

దీం తో  అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రుల ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేశా రు. పిల్లలు తప్పు చేస్తే పెద్దలదే బాధ్య త, చదువుకునే వయస్సులో తప్పు చేస్తే వారి భవిష్యత్‌ నాశనం అవుతుంది, జాగ్రత్త వహించాలని హెచ్చరించి పంపించారు. జాగ్రత్త చెబుతామని అబ్బాయి తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. పరీక్ష గదిని మార్చాలని అమ్మాయి తల్లిదండ్రులు కోరగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అబ్బాయిని వేరే రూమ్‌కు  మార్పుచేస్తామని పరీక్షా కేంద్రం ఇన్‌చార్జి వై.కృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement