విశాఖపట్నం నగరంలోని అరిలోవ ప్రాంతంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు.
విశాఖపట్నం నగరంలోని అరిలోవ ప్రాంతంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళ ను తాళ్లతో బంధించి చెరువులో పడేశారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సోమవారం చెరువు నీటిలో మహిళ మృతదేహం పైకి తేలి కనిపించడంతో సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి 7వ తేదీన దాడి లక్ష్మి (45) అనే మహిళ అదృశ్యం కాగా దానిపై కేసు నమోదైంది. తాజాగా బయటపడిన మహిళ మృతదేహం ఆమెది కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.