రైతుల్ని ప్రభుత్వం మోసం చేసింది
Published Thu, Aug 11 2016 10:12 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
- సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్
అనంతపురం అర్బన్ :
నాసిరకం వేరుశనగ విత్తనకాయ అందించి కరువు రైతును ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మండిపడ్డారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు వేరుశనగ సాగు చేశారన్నారు. అయితే రైతులకు జిల్లా యంత్రాంగం పంపిణీ చేసిన వేరుశనగ విత్తనకాయ నాణ్యత లోపం కారణంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. చెట్లు ఏపుగా పెరిగాయే తప్ప ఊడలు దిగలేదన్నారు. ఇలాంటి విత్తనం సరఫరా చేసిన వారిని, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు సి.జాఫర్, పి.నారాయణస్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు.
Advertisement
Advertisement