అడ్డుకోవడం అప్రజాస్వామికం: చాడ
సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజె క్టు ముంపు గ్రామాలను పరిశీలించేందుకు వెళుతున్న న్యాయవాదులను అడ్డుకోవడాన్ని సీపీఐ ఖండించింది. ముంపు గ్రామాలకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, చివరకు న్యాయవాదులూ వెళ్లకుండా అడ్డుకుని ఇనుప తెర వేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.
ప్రజలు తమ గోడును ఎవరికీ చెప్పుకోనివ్వకుం డా, భూములను ఇవ్వడం తప్ప మరో మార్గం లేదన్న విధంగా ప్రభుత్వం భయోత్పాతాన్ని సృష్టించడం నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని ఒక ప్రకటనలో చాడ పేర్కొన్నారు.