మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఆదిలాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అహేరి అటవీప్రాంతంలో సిరోంచా వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ గ్రెహౌండ్స్, మహారాష్ట్ర సీ-60 కమేండర్ సంయుక్త బృందానికి ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగినట్లు సమాచారం.
మృతి చెందిన మావోయిస్టులను దినేష్, ముఖేష్, ఆదిలాబాద్ డివిజన్ కమాండర్ శోభన్లుగా గుర్తించారు. గొండు గిరిజన తెగకు చెందిన శోభన్(32).. ఆదిలాబాద్ ప్రాంతంలోని మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక వ్యక్తి. ఘటనా స్థలంలో ఏకే 47తో పాటు, ఎస్ఎల్ఆర్, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.