జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేరస్థుడు పోలీసుల కళ్లు గప్పి పరారైన సంఘటనలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
వరంగల్: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేరస్థుడు పోలీసుల కళ్లు గప్పి పరారైన సంఘటనలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఉప్పల సూరి అనే ఖైదీ పరారైన సమయంలో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇ. లింగారెడ్డి, ఎన్. మల్లారెడ్డి, డి. అంజయ్య లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు
వరంగల్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉప్పల సూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి భూపాలపల్లి డిపో బస్సులో వరంగల్‌కు తీసుకెళ్తుండగా, యశ్వంతాపూర్ సమీపంలోకి వెళ్లగానే మూత్రానికని చెప్పి, బస్సును ఆపించి పరారైన విషయం తెలిసిందే.