రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
Published Sun, Sep 4 2016 10:21 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కట్టంగూర్
మండలంలోని పామనగుండ్ల గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా విజయవరం గ్రామానికి చెందిన ఈపూరి సత్యనారాయణరాజు (50)జహీరాబాదు నుంచి మహీంధ్రా ట్రాక్టర్‌ను డెలివరీ చేసేందుకు ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యంలోని పామనగుండ్ల గ్రామశివారులోకి రాగానే అతివేగంగా వెళుతున్న లారీ ఓవర్‌టేక్ చేస్తూ ట్రాక్టర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఫల్టీలు కొట్టుకుంటూ జాతీయరహదారి పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన క్షతగాత్రున్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Advertisement
Advertisement