పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం నేతల అక్రమాలపై టీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు.
హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం నేతల అక్రమాలపై టీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సీపీఎం నేతల అక్రమాలపై ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫిర్యాదు చేశారు. తెల్దారుపల్లి బూత్‌నంబర్లు 116, 117, 118 లో కొన్ని దశాబ్దాలుగా సీపీఎం నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని బాల్కసుమన్ ఆరోపించారు.
ఏ పార్టీ నేతలు ఆ గ్రామానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఈసీ ఎదుట వాపోయారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గ్రామంలో ఆయన నేతృత్వంలో ఇదంతా జరుగుతోందని చెప్పారు. తమ్మినేని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ బాల్కసుమన్ విమర్శించారు.