కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప నగర శివారులోని ఇక్బాల్ రైస్ మిల్లు వద్ద 40వ నెంబర్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పులివెందుల నుంచి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.