అభినవ పోతనకు అశ్రునివాళి | vaanamamalai varadaacharyulu 104va jayanthi | Sakshi
Sakshi News home page

అభినవ పోతనకు అశ్రునివాళి

Published Tue, Aug 16 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

అభినవ పోతనకు అశ్రునివాళి

అభినవ పోతనకు అశ్రునివాళి

  • వానమామలై వరదాచార్యులు 104వ జయంతి వేడుకలు
  • నివాళులర్పించిన నాయకులు
  • చెన్నూర్‌ : చీకటిని పారదోలడానికి కలం అనే ఆయుధం పట్టి.. కవిత్వం అనే మార్గం ఎంచుకున్నాడు.. సామాజిక రుగ్మతల్ని తొలగించాడు. మనిషికి మంచి నేర్పాడు.. మంచికి మారు పేరుగా నిలిచాడు. దేశభవిత విద్యార్థుల చేతుల్లో ఉంటుందని గ్రహించి ఉపాధ్యాయుడయ్యాడు. సాటి మనిషి కష్టం తెలుసుకుని సామాన్యుడయ్యాడు. అభినవ పోతనై ఆదర్శప్రాయంగా నిలిచాడు.. అక్షర తూణీరమై లక్షలాది ‘మనసు’ల మది దోచాడు. వానమామలై వరదాచార్యులు.. ఆయనకు అఖిల ప్రజానీకం అశ్రునివాళి తెలుపుతోంది. పట్టణంలో అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు 104వ జయంతి వేడుకలను సర్పంచ్‌ సాధనబోయిన కష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
    స్థానిక జగన్నాథాలయం ఎదుట గల వరదాచార్యుల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదాచార్యులు ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాశారని పేర్కొన్నారు. ఆయన కీర్తీ రాష్ట్ర నలుమూలలా వ్యాప్తి చెందిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నవాజ్, వార్డు సభ్యులు గడ్డ మల్లయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు దామోదర్‌రెడ్డి, తనుగుల రవికుమార్, మద్ద మధు, ఖాలీల్‌. ఆయుబ్, ఆరీఫ్‌. నహీం,  పొగుల సతీశ్, చకినారపు మల్లేశ్, పాయిరాల బాపు, మల్లికార్జున్‌యాదవ్‌ అఖిల్, అగయ్య, కొండపార్తి వెంకటరాజం, తగరం శంకర్, లక్ష్మణ్, యాసిన్, రాయి వెంకటేశ్‌లు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement