ఠారెత్తిస్తున్న వ్యాధులు | vacansies in distict hospitals | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్న వ్యాధులు

Published Wed, Jun 29 2016 3:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

vacansies in distict hospitals

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
వేలల్లో నమోదవుతున్న కేసులు
ముందస్తు చర్యలు శూన్యం
వేధిస్తోన్న  ఖాళీల కొరత
వైద్య, ఆరోగ్య శాఖ మేల్కొంటేనే మేలు

నిజామాబాద్ అర్బన్ : వ్యాధుల కాలం వచ్చేసింది. అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో చిరుజల్లులు కురుస్తున్నారుు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుంటలు, మురుగునీటి కాల్వలు, రహదారులపై గుంతలు చెత్తాచెదారంతో నిండారుు. వీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెంది.. జ్వరాలు, కలరా, మలేరియూ, టైపారుుడ్ సోకుతున్నారుు. డెంగీ, చికున్‌గున్యా సోకే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రోగులతో ఆస్పత్రులు కిటికిటలాడుతున్నారుు. వీటికితోడు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రణాళికలు కూడా తయూరు చేయలేదు. మెడికల్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేయలేదు.

వారం పాటు సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సమావేశాలు తూతూ మంత్రంగా సాగా యి. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలున్నారుు. వీటిలో ఎక్కడా దోమల నివారణకు ఫాగింగ్ చేసిన దాఖలా లు లేవు. మురికి కాల్వల్లో బ్లీచింగ్ పౌడరైనా చల్లలే దు. గ్రామీణ ప్రాంతాల్లోని బావుల్లో పంచాయతీలు బ్లీచింగ్ చేయలేదు. ఇటువంటి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు ఆస్పత్రుల్లో ప్రధానంగా వైద్యాధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది.

జ్వరపీడితులు అధికం..
జిల్లాలో 44 ప్రాథమిక, 375 ఉప ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియూ ఆస్పత్రులు, 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నారుు. గతేడాది జిల్లాలో 243 డెంగీ కేసులు నమోదయ్యాయి. 18 మంది మరణించారు. దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధిని నియంత్రించడంలో అధికారు లు విఫలమయ్యూరు. గతేడాది అతిసార కేసులు 250, నీళ్ల విరోచనాలు 7,908, టైఫారుుడ్ 257, జ్వరం కేసులు 1.17 లక్షలు నమోదయ్యూరుు. కలుషితాహా రం తినడం వల్ల 158 మంది ఆస్పత్రి పాలయ్యూరు. 17 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా ముగ్గురు మరణించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నీళ్ల విరోచనాలు 2,750, టైఫారుుడ్ 20, జ్వరం కేసులు 59,122 నమోదయ్యూరుు. కలుషిత ఆహారం తినడం వల్ల 130 మంది ఆస్పత్రి పాలయ్యూరు. స్వైన్‌ఫ్లూ కేసులు లేవు. జ్వరపీడిత కేసులు వేలల్లో నమోదవుతున్నా పట్టించుకున్న వారే లేరు. డెంగీ కేసులకు సంబంధించి మలేరియ శాఖ సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది.

 వేధిస్తున్న ఖాళీలు..
వైద్య ఆరోగ్య శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి, అదనపు వైద్యాధికారితోపాటు ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, శిక్షణ అధికారితోపాటు పరిపాలన అధికారి, జిల్లా కుష్టు నివార ణ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు డిప్యూటీ సివిల్ సర్జన్ 10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 8, స్టాటిస్టికల్ ఆఫీసర్ 1, హెడ్‌నర్సు 8, ఏఎన్‌ఎం 108, ఫార్మసిస్టు 10, ల్యాబ్‌టెక్నిషియన్ 14, స్టాఫ్‌నర్సు 36,  మెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 130 ఖాళీగా ఉన్నా యి. దీంతో క్షేత్ర స్థాయిలో వైద్యసేవలకు విఘాతం కలుగుతోంది. ముఖ్యమైన అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తేనే మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది.

 అప్రమత్తంగా ఉన్నాం.. - డాక్టర్ వెంకట్, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. వ్యాధుల నియంత్రించేందుకు వైద్యాధికారుల కు ఇదివరకే ఆదేశాలు జారీ చేశాం. వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement