వేంగి కళా ఉత్సవం.. అద్భుతహః
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరానికి చెందిన నాట్యాచారిణి గండికోట అలివేలు ఉష ఆధ్వర్యంలో గురువారం నగరంలో వేంగి కళా ఉత్సవం ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం జాతీయస్థాయి నృత్య పోటీలు, సాయంత్రం వివిధ రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి కళాకారుల నత్య ప్రదర్శనలు అలరించాయి. ఆయా నృత్య కళాకారులు తమ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ కృత్యాలను నగరవాసులకు పరిచయం చేశారు. ప్రత్యేకించి పూణేకు చెందిన సాయి పరాంజపే, గుజరాత్‌కు చెందిన జుగ్ను కపాడియా, పాండిచ్చేరికి చెందిన కృష్ణన్, ప్రీతే ప్రభు నత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.