
దోపిడీలేని తెలంగాణ కావాలి
బహుజన బతుకమ్మ వేడుకల్లో విమలక్క
కోనరావుపేట: దోపిడీ లేని తెలంగాణ కావాలని, దొరల తెలంగాణ వద్దని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో ఆదివారం నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఆమె బతుకమ్మ ఆడారు. విమలక్క మాట్లాడుతూ పంటలపై పెట్టుబడులు రాక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో బతుకమ్మ పండుగ కోసం రూ.15 కోట్లు కేటాయించి, వృథాచేయడం సరైంది కాదన్నారు. నాడు దొరల ఆజమాయిషీ వల్ల మహిళలు బతుకమ్మకు దూరమయ్యారని, ఈనాడు కూడా ప్రభుత్వ చర్యల వల్ల మళ్లీ దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్ నియంత పాలనను కొనసాగిస్తోందని, ఎన్‌కౌంటర్లు, రైతులు ఆత్మహత్యలు, మహిళలపై దోపిడీలు జరుగుతున్నాయన్నారు.