సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయండి
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఉషారాణి అధికారులను ఆదేశించారు.
-
మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఉషారాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో వివిధ సంక్షేమ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో సెక్రటరీ మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మైనార్టీలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, నివాసస్థలాలు, భూములు కేటాయించాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్‌ఓ మార్కండేయులు, నెల్లూరు ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ షంషుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో రుణాలు మంజూరు చేయండి
జిల్లాలో కౌలు రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ ఇంతియాజ్ సంబంధిత అ«ధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. అర్హులైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలన్నారు. ఎల్‌ఈసీ కార్డుదారులకు రుణాలు మంజూరు చేయడంలో బాలాయపల్లి, వెంకటగిరి, కోట, సూళ్లూరుపేట, చిట్టమూరు, చిల్లకూరు, తడ మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించి నిర్ధేశించిన రుణాల లక్ష్యాలను సాధించాలని సూచించారు. రుణాల రీషెడ్యుల్‌లో సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకుల అధికారులతో చర్చించి రుణాలు మంజూరు చేయించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట ఆర్‌డీఓలు వెంకటేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, శీనానాయక్, వ్యవసాయశాఖ డీడీలు తదితర అధికారులు పాల్గొన్నారు.