రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
చుండూరు: రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మున్నంగివారిపాలెంకు చెందిన ఇక్కుర్తి సీతయ్య అతని భార్య కావ్య(23) ఆదివారం ఉదయం కాకాని దేవాలయంలో పూజలు నిర్వహించుకొని స్వగ్రామం మున్నంగివారిపాలెంకు మోటారు బైక్‌పై బయలుదేరారు. కొత్తపల్లి గ్రామానికి సమీపంలో ఎరువుల లోడుతో చుండూరు వైపునకు వస్తున్న లారీని సీతయ్య ఓవర్ టేక్ చేయబోయాడు ఆదుపు తప్పి భార్యాభర్తలు కిందపడ్డారు. ఈ సంఘటనలో లారీ వైపునకు పడిన కావ్యపై లారీ వెనుక టైరు ఎక్కడంతో సంఘటనా స్థలంలోనే∙మృతి చెందింది. చుండూరు ఎస్‌ఐ విక్టరీ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. కావ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనలో సీతయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. కావ్య మృతి వార్తను తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.