జీతాలు ఇవ్వకపోతే బతికేదెలా?
-
విద్యుత్ భవన్ ముందు ధర్నా
నెల్లూరు (టౌన్):
సబ్‌స్టేషన్‌లల్లో పనిచేసే షిప్టు ఆపరేటర్లుకు 4 నెలలు, మీటర్లు రీడర్లకు 6 నెలలుగా జీతాలు అందక పోవడంతో కుటుంబ పోషణ గగనంగా మారిందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ గౌరవాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ భవన్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎండీ ఉత్తర్వులు ఇచ్చినా కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, ఎల్‌ఐసీ అమలు కావడం లేదన్నారు. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోతే అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జాకీర్‌హుస్సేన్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేనెల 3,4 తేదీల్లో రిలే దీక్షలు చేస్తామని, అప్పటికి స్పందించకుంటే 13న విద్యుత్ భవన్‌ను మట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు కత్తిశ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షుడు శరత్‌బాబు, నరేంద్ర, యూనియన్ నాయుకులు వాసిరెడ్డి సుధాకరరావు, ఖాజావలి, నాగయ్య, పెంచలప్రసాద్, జి.ఎస్.బాబు, రామయ్య, కృష్ణ, హజరత్‌వలి పాల్గొన్నారు.