సరికొత్త ఐడియాతో వినూత్న సాగు
- బైక్ సాయంతో కలుపు మొక్కలను తీసేసిన యువరైతు
దాచేపల్లి (గుంటూరు)
ఓ ఐడియా సరికొత్త సాగుకు తెరలేపింది. ద్విచక్రవాహనంతో వ్యవసాయంలో వినూత్న ప్రయత్నానికి ఓ యువ రైతు శ్రీకారం చుట్టారు. దాచేపల్లికి చెందిన బొమ్మిరెడ్డి శివ అనే రైతు తన మిరప పంటలోని కలుపు మొక్కలను తీసేందుకు మోటారు బైక్‌ను ఉపయోగించాడు. పంటలో కలుపు మొక్కలు బాగా పెరిగాయి.
వాటిని ఎద్దుల సాయంతో తీయాలంటే తన మూడెకరాలకు రూ.1800 ఖర్చు అవుతుంది. వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయని భావించిన అతను ఓ ఐడియాతో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. తన బంధువుల నుంచి ద్విచక్రవాహనం తీసుకుని దానికి గుంటకు తోలే యంత్రాన్ని కట్టి వ్యవసాయం చేశాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే మూడు ఎకరాల్లోని కలుపు మొక్కలను తీసేశాడు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో పాటుగా అరకలకు బాగా గిరాకీ పెరిగిందని, ఖర్చును తట్టుకోలే ద్విచక్రవాహనానికి లీటర్ పెట్రోల్ పోసి మూడు ఎకరాలను గుంటకు తోలమని రైతులు శివ చెప్పారు.