మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి వనం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్కూరి వెంకటస్వామి(24) మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వర్‌రావుపల్లె గ్రామానికి చెందిన వెంకటస్వామి తన మోటార్‌సైకిల్‌పై మంచిర్యాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Sep 22 2016 11:04 PM | Updated on Aug 30 2018 4:10 PM
రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి వనం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్కూరి వెంకటస్వామి(24) మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వర్‌రావుపల్లె గ్రామానికి చెందిన వెంకటస్వామి తన మోటార్‌సైకిల్‌పై మంచిర్యాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. అతడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటికి కూతవేటు దూరంలోనే సంఘటన చోటుచేసుకుంది. మృతుడి తండ్రి కట్కూరి రాజం సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. అతడికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు వెంకటస్వామి. ఇంట్లో చిన్నవాడైన వెంకటస్వామి రోడ్డు ప్రమాదంలో మత్యువాతపడటంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనా స్థలిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు ఇటీవలే డిగ్రీ పూర్తిచేశాడు. ఈ మేరకు పట్టణ ఎస్సై గోనెం రాకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement