తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భరత్ భూషణ్ రథ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2016 వరించింది. ఆయన రచించిన వనవైభవం(గ్లోబల్ ఆఫ్ ఫారెస్ట్)కు సంస్కృత విభాగం నుంచి ఈ అవార్డు లభించింది.
బహుమతి కింద 50 వేల నగదు, ప్రశంసా పత్రం, కాంస్య పతకం అందజేస్తారు. పర్యావరణ ఆవశ్యకతను, అడవుల సంరక్షణను ప్రోత్సహిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణంపై తనకున్న ప్రేమే ఈ అవార్డును సాధించి పెట్టిందని చెప్పారు. పురస్కారానికి ఎంపికవడంపై విద్యాపీఠం ఇన్‌చార్జ్ వీసీ ఎస్‌ఎస్ మూర్తి, రిజిస్ట్రార్ ఉమాశంకర్ ఆయనను అభినందించారు.
భరత్ భూషణ్ రథ్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
Published Fri, Jun 17 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement