ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలు? | IIT offering Aeronautical Engineering course? | Sakshi
Sakshi News home page

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలు?

Published Thu, Aug 21 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలు?

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలు?

 బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సు వివరాలను తెలపండి?
 -నరేష్, భద్రాచలం.
 
 వ్యవసాయ రంగంలో నాణ్యత, వ్యాపార నిర్వహణ అంశాలకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే విధంగా బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సు కూర్పు ఉంటుంది. ఈ కోర్సు సిలబస్.. దాదాపుగా బీఎస్సీ(అగ్రికల్చర్) మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఫారెస్ట్రీ, హోమ్ సైన్స్, స్టాటిస్టిక్స్-మ్యాథమెటిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్, ప్రాసెస్ ఆఫ్ ప్లాంటింగ్, కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ యూసేజ్,
 
 క్రాఫ్ట్ ఫిజియాలజీ తదితర అంశాలు ఉంటాయి. బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. వీరికి వివిధ బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సీడ్స్ కంపెనీలో ప్రొడక్షన్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లలో, అగ్రి ఇన్సూరెన్స్ కంపెనీలు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఇరిగేషన్ సంస్థలు, డెయిరీ-పౌల్ట్రీ సంబంధిత పరిశ్రమలు, ఆక్వాకల్చర్ రంగాల్లో మార్కెటింగ్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
 
 ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: ఇంటర్మీడియెట్ (ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్/నేచురల్ సెన్సైస్/మ్యాథమెటిక్స్). ఈ కోర్సు తర్వాత పీజీ చేసే అవకాశం కూడా ఉంది.
 వివరాలకు:www.angrau.ac.in
 
 ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు, కోర్సు పూర్తి చేసిన వారికి ఉండే అవకాశాలు తెలియజేయగలరు?
 -రమేశ్, నిజామాబాద్.
 
 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్..
 ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
     వెబ్‌సైట్: www.osmania.ac.in
 
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్..
 మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.uohyd.ernet.in
 
 ఐఐటీ, రూర్కీ.. ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.iitr.ac.in, www.iitg.ac.in
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రాలో ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథ్స్) అందుబాటులో ఉంది.
 అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.bitmesra.ac.in
 కోర్సు పూర్తిచేసిన తర్వాత రీసెర్చ్, కంప్యుటేషన్, డేటా మైనింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ రంగాల్లో అవకాశాలను అందుకోవచ్చు.
 
 ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీలేవి?    -దేవెందర్, సూర్యాపేట.
 ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎయిరోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వెహికిల్ స్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ, ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, క్యాడ్/క్యామ్, న్యూమరికల్ మెథడ్స్, హెలికాప్టర్ ఇంజనీరింగ్ తదితర అంశాలను బోధిస్తారు.
 
 ఐఐటీ-మద్రాస్
 కోర్సులు:బీటెక్(ఏరోస్పేస్ ఇంజనీరింగ్),బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ(ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఇన్ అప్లయిడ్ మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ.
 వెబ్‌సైట్: www.iitm.ac.in
 ఐఐటీ-బాంబే
 కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్)
 వెబ్‌సైట్: www.iitb.ac.in
 ఐఐటీ-కాన్పూర్
 కోర్సు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్)
 వెబ్‌సైట్: www.iitk.ac.in
 ఐఐటీ-ఖరగ్‌పూర్.
 కోర్సులు: బీటెక్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్), బీటెక్-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ
     వెబ్‌సైట్: www.iit-kgp.ac.in
 ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 
 www.sakshieducation.com లో ఐబీపీఎస్ క్లర్క్ స్టడీ మెటీరియల్
 
 హైదరాబాద్: పోటీ పరీక్షల సమగ్ర సమాచారానికి కేరాఫ్ సాక్షిఎడ్యుకేషన్ డాట్ కామ్. వీఆర్‌వో మొదలుకొని ప్రతిష్టాత్మక సివిల్స్ దాకా అన్ని పరీక్షలకూ అభ్యర్థులకు మార్గదర్శినిగా నిలుస్తోంది. ఈ కోవలోనే తాజాగా విడుదలైన ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షకు చదవాల్సిన సమాచారాన్నంత అందుబాటులో ఉంచింది. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఏపుస్తకాలు చదవాలి? తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు ఎలా సాధించాలి? వంటి వాటితో పాటు చాప్టర్ల వారీగా నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్, షార్ట్ కట్స్, వివరణలతో కూడిన ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్లను అందిస్తోంది.
 
  పోటీ పరీక్షల్లో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్, జీకేలకు సంబంధించి సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. క్లర్క్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్(స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ), ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగానికి 40 మార్కులు. అన్ని సబ్జెక్టులు కలిపి దాదాపు 5000 పైగా ప్రశ్నల నిధి అందుబాటులో ఉంది. ఈ ప్రశ్నల నిధిని సాధన చేసి అభ్యర్ధులు మంచి మార్కులు సాధించొచ్చు.
 వెబ్‌సైట్: http://www.sakshieducation.com/Banks/Index.htm

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement