మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు? | My music is a man - man who is call my message? | Sakshi
Sakshi News home page

మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు?

Published Sat, May 24 2014 10:04 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు? - Sakshi

మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు?

 డైట్‌సెట్ - 2014
 తెలుగు

డైట్‌సెట్ ప్రవేశ పరీక్షలో తెలుగు సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మాతృభాష తెలుగే కదా అని అభ్యర్థులు అశ్రద్ధ చేయకూడదు. పోటీ పరీ క్షలో ప్రతి విభాగం ముఖ్యమైందే. ప్రతి ప్రశ్న, ప్రతిమార్కూ కీలకమే. అభ్యర్థులు మంచి ర్యాంకు సాధించాలంటే మొదట తెలుగు విభాగంపై పట్టు సాధించాలి.
 
దీంట్లో ఎక్కువ గా కవులు- రచయితలు, వారి కాలాలు, వారి బిరుదులు, రచనలు, కావ్య ప్రక్రియలు, ప్రసిద్ధ కొటేషన్లు లాంటి సాహిత్య అంశాలు; సంధులు సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, అర్థా లు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి- వికృతులు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు, నామ్నీకరణం, వాక్య భేదాలు లాంటి వ్యాకరణాంశాలపై ప్రశ్నలు వస్తాయి.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    పిల్లలమర్రి పినవీరభద్రుడు ఎవరి ఆస్థాన కవి?
     1) తుళువ నరసింహరాయలు
     2) రెండో నరసింహరాయలు
     3) సాళువ నరసింహరాయలు
     4) హరిహర బుక్కరాయలు
 
 2.    ‘కొడుకుల్ బుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై’ పద్యం ఏ శతకం లోనిది?
     1) భాస్కర శతకం    2) దాశరథీ శతకం
     3) సుభాషిత రత్నావళి
     4) శ్రీ కాళహస్తీశ్వర శతకం
 
 3.    జాషువాకు ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
     1) ఫిరదౌసి          2) గబ్బిలం
     3) ముంతాజ్ మహల్    4) క్రీస్తు చరిత్ర
 
 4.    ‘ఆధునిక వచన రచనకు పట్టుగొమ్మ’ అని ఎవరినంటారు?
     1) చాసో     2) కొడవటిగంటి
     3) శ్రీపాద     4) గురజాడ
 
 5.    వ్యక్తిని లేదా వ్యవస్థను విమర్శించడం ఏ ప్రక్రియలో సాధారణం?
     1) కథానిక     2) నవల
     3) గల్పిక    4) వైజ్ఞానిక కల్పన వ్యాసం
 
 6.    మహాత్ముని ఆస్థాన కవి అనిపించుకున్నవారు?
     1) బసవరాజు అప్పారావు
     2) తుమ్మల సీతారామమూర్తి చౌదరి
     3) త్రిపురనేని రామస్వామి చౌదరి
     4) గరిమెళ్ల సత్యనారాయణ
 
 7.    పుట్టపర్తి రచించిన మేఘదూతం ఒక?
     1) గేయకావ్యం     2) కవితా సంకలనం
     3) వచన కవితా సంపుటి
     4) ఖండకావ్యం
 
 8.    }పాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఆత్మకథ
     1) మూన్నాళ్ల ముచ్చట
     2) బ్రతుకు మూట
     3) అనుభవాలు- జ్ఞాపకాలు
     4) అనంతం
 
 9.    ఏ రచనతో శ్రీశ్రీ అభ్యుదయ కవిగా పేరుగాంచాడు?
     1) ఖడ్గసృష్టి    2) మహాప్రస్థానం
     3) మరో ప్రస్థానం
     4) చరమరాత్రి
 
 10.    శృంగార శాకుంతలం ఎవరి రచన?
     1) శ్రీనాథుడు
     2) పిల్లలమర్రి పినవీరభద్రుడు
     3) పింగళి సూరన
     4) పిల్లలమర్రి చినవీరభద్రుడు
 
 11.    స్వారోచిష మనుసంభవం అనే పేరున్న కావ్యం?
     1) అనరుద్ధ చరిత్ర
     2) సారంగధర చరిత్ర    3) మనుచరిత్ర
     4) వసు చరిత్ర
 
 12.    ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది?
     1) కందుకూరి వీరేశలింగం
     2) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
     3) సురవరం ప్రతాపరెడ్డి
     4) చేకూరి రామారావు
 
 13.    ఏ కవి వర్ణనలు ప్రబంధ కవులకు మార్గదర్శకం అయ్యాయి?
     1) ఎర్రన    2) తిక్కన
     3) నన్నెచోడుడు    4) అల్లసాని పెద్దన
 
 14.    అనువాద పద్ధతి, శైలిలో తెలుగు కవులు ఎవరి కవితా మార్గాన్ని అనుసరించారు?
     1) నన్నయ     2) తిక్కన
     3) శ్రీనాథుడు    4) పోతన
 
 15.    ఎవరి సీస పద్యాలకు విశిష్ట స్థానం ఉంది?
     1) తిక్కన     2) కాసుల పురుషోత్తమ కవి
     3) శ్రీనాథుడు    4) పింగళి సూరన
 
 16.    పుట్టపర్తి నారాయణాచార్యుల బిరుదు?
     1) సరస్వతీ పుత్రుడు    2) అభినవ పోతన
     3) అభినవ తిక్కన    4) కవి మిత్రుడు
 
 17.    పేరడీ ప్రక్రియకు ఆద్యులు?
     1) శ్రీశ్రీ
     2) వేదుల సత్యనారాయణ శాస్త్రి
     3) జరుక్ శాస్త్రి    4) కృష్ణశాస్త్రి
 
 18.    పిల్లలమర్రి పినవీరభద్రుని జైమినీ భారతం ఏ కావ్యం?
     1) వీరరస     2) శృంగార
     3) శాంతరస     4) కరుణరస
 
 19.    సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళ నమైన పుట్టపర్తి నారాయణాచార్యుల రచన?
     1) పండరి భాగవతం   2) సాక్షాత్కారం
     3) మేఘదూతం         4) శివ తాండవం
 
 20.    నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణం కానిది?
     1) అక్షర రమ్యత    2) సూక్తి వైచిత్రి
     3) నానారుచిరార్థసూక్తి నిధిత్వం
     4) ప్రసన్న కథా కవితార్థయుక్తి
 
 21.    గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువదిం చినవారు?
     1) దాశరథి రంగాచార్యులు
     2) దాశరథి కృష్ణమాచార్యులు
     3) సినారె    4) ఆరుద్ర
 
 22.    వార్తాపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను వాడినవారు?
     1) తాపీ ధర్మారావు
     2) కాశీనాథుని నాగేశ్వర రావు
     3) కందుకూరి    4) గురజాడ
 
 23.    {తిపురనేని రామస్వామి చౌదరి కలం నుంచి జాలువారిన సూత పురాణం ఏ వాదానికి చెందింది?
     1) స్త్రీవాదం     2) హేతువాదం
     3) మైనారిటీ వాదం    4) దళిత వాదం
 
 24.    బారిష్టర్ పార్వతీశం నవలాకారుడు?
     1) మొక్కపాటి నరసింహశాస్త్రి
     2) పానుగంటి లక్ష్మీనరసింహం
     3) విశ్వనాథ సత్యనారాయణ
     4) చిలకమర్తి లక్ష్మీనరసింహం
 
 25.    చంపూ రామాయణం, చంపూ భారతం- కావ్యాలను రాసినవారు?
     1) పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు
     2) పురాణపండ సుబ్రహ్మణ్యశాస్త్రి
     3) కందుకూరి వీరేశలింగం
     4) అల్లంరాజు రంగసాయి కవి
 
 26.    దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ఏ ప్రక్రియ?
     1) నవల     2) కథా సంపుటి
     3) కవితా సంపుటి     4) కావ్యం
 
 27.    అనుభూతి ప్రాధాన్యంతో కవితలు రాసినట్లు ప్రసిద్ధి చెందినవారు?
     1) ఆరుద్ర     2) తిలక్
     3) జాషువా     4) దాశరథి
 
 28.    శారద లేఖలు రచనతో లేఖా సాహిత్యాన్ని పరిపుష్టం చేసినవారు?
     1) ఆచంట శారదా దేవి
     2) మల్లాది సుబ్బమ్మ
     3) బసవరాజు రాజ్యలక్ష్మమ్మ
     4) కనుపర్తి వరలక్ష్మమ్మ
 
 29.    మనుష్యుడే నా సంగీతం- మానవుడే నా సందేశం అన్న కవి ఎవరు?
     1) దాశరథి     2) సినారె
     3) శ్రీశ్రీ     4) నగ్నముని
 
 30.    ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది?
     1) జ్ఞాన వాశిష్టం
     2) రామేశ్వర మహత్యం
     3) సుభాషిత రత్నావళి
     4) విశ్వామిత్ర చరిత్ర
 
 31.    {Vంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రచయిత రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి మరో పేరు?
     1) శ్రీకారం     2) అంతరంగం
     3) ఆముఖం     4) విష్కంభం
 
 32.    ఉదయశ్రీ ఖండకావ్య సంపుటాలను రచించిన కవి?
     1) రాయప్రోలు సుబ్బారావు
     2) జంధ్యాల పాపయ్యశాస్త్రి
     3) జాషువా    4) కృష్ణశాస్త్రి
 
 33.    అనుభూతి చిత్రణంతో అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ప్రాధాన్యం ఉండే ప్రక్రియ ఏది?
     1) ఏకాంకిక     2) కథానిక
     3) గల్పిక     4) స్వీయ చరిత్ర
 
 34.    సినిమా జీవితాన్ని మన కళ్ల ఎదుట ఆవిష్క రించే ‘పాకుడు రాళ్లు’ నవలా రచయిత?
     1) యన్.ఆర్. నంది
     2) రాచకొండ విశ్వనాథ శాస్త్రి
     3) దాశరథి రంగాచార్య
     4) రావూరి భరద్వాజ
 
 35.    అయ్యగారి వీరభద్రరావు రచించిన, అశరీరి, దయ్యాల కొంప మొదలైనవి ఏ ప్రక్రియ?
     1) కథ     2) కథానిక
     3) నాటిక     4) వ్యాసం
 
 36.    గోలకొండ పత్రిక సంపాదకులు?
     1) కాశీనాథుని నాగేశ్వరరావు
     2) ముట్నూరి కృష్ణారావు
     3) సురవరం ప్రతాపరెడ్డి
     4) కందుకూరి వీరేశలింగం
 
 37.    యండమూరి భద్రాచార్యుల బిరుదు కానిది?
     1) అభినవ హరిశ్చంద్ర
     2) అభినవ కుచేల
     3) సువర్ణ హస్త ఘంటాకంకణ
     4) నాట్యాచార్య
 
 38.    పరిశోధన, పరిశీలన, ఎవరి వ్యాస సంకలనాలు?
     1) జి.వి. సుబ్రహ్మణ్యం
     2) యస్వీ రామారావు
     3) నాయని కృష్ణకుమారి
     4) నండూరి రామ్మోహనరావు
 
 39.    బోయ జంగయ్య రచించిన ప్రసిద్ధ నవల?
     1) జాతర    2) ఎచ్చరిక
     3) పావురాలు    4) జగడం
 
 40.    గౌతమి కోకిల బిరుదాంకితులు?
     1) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
     2) వేదుల సత్యనారాయణ శాస్త్రి
     3) గుర్రం జాషువా
     4) దువ్వూరి రామిరెడ్డి
 
 41.    కైఫియత్తు ఏ భాషా పదం?
     1) లాటిన్     2) జర్మన్
     3) హిందూస్తానీ     4) గ్రీక్
 
 42.    నార్ల వెంకటేశ్వరరావు ‘నాయకత్వం’ పాఠ్యభాగం ఏ కోవకు చెందింది?
     1) వార్తా వ్యాఖ్య    2) పీఠిక
     3) సాహిత్య విమర్శనా వ్యాసం
     4) సంపాదకీయ వ్యాసం
 
 43.    {తిపురనేని గోపీచంద్ ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ సంపుటిలోని కథలను ఏమని పేర్కొన్నారు?
     1) గల్పికలు     2) స్కెచ్‌లు
     3) పేరడీలు    4) స్వగతాలు
 
 44.    పంజాబ్‌లో తుమ్మచెట్టును ఏమని పిలుస్తారు?
     1) కికార్     2) కురువేళం
     3) గోబ్లి,బాల్     4) స్వర్ణపుష్పం
 
 45.    విజ్ఞాన చంద్రిక గ్రంథమండలిని ఎవరు స్థాపించారు?
     1) సురవరం ప్రతాపరెడ్డి - 1925
     2) కొమర్రాజు లక్ష్మణరావు - 1906
     3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు-1905
     4) కందుకూరి వీరేశలింగం- 1897
 
 46.    అంబేద్కర్ తన జీవిత నిర్మాతలు, గురువులుగా ఎవరిని పేర్కొన్నారు?
     1) విద్య, స్వాభిమానం, శీలం
     2) గాంధీజీ, కబీర్, భగవద్గీత
 3)    భగవాన్ బుద్ధ, భక్త కబీర్, జ్యోతిబాపులే
     4) శీలం, ఆత్మాభిమానం, భగవంతుడిపై         విశ్వాసం
 
 47.    చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస అనే విమర్శ వ్యాఖ్యాన గ్రంథం రాసినవారు?
     1) తాపీ ధర్మారావు
     2) పుట్టపర్తి నారాయణాచార్యులు
     3) విశ్వనాథ సత్యనారాయణ
     4) జి.వి. సుబ్రహ్మణ్యం
 
 48.    గోరాశాస్త్రి ఆయా పత్రికల్లో ఏ పేరుతో శీర్షికను నిర్వహించారు?
     1) కౌండిన్య     2) ఆనందవీణ
     3) మాణిక్యవీణ     4) వినాయకుడి వీణ
 
 49.    చాసో బొండుమల్లెలు కథానికతో పాటు ఇతర రచనల్లో ఏ ప్రాంతం మాండలికాన్ని ప్రయోగించారు?
     1) తెలంగాణ     2) విశాఖ
     3) గోదావరి     4) రాయలసీమ
 
 50.    స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యల ను ప్రధాన ఇతివృత్తంగా అనేక నవలలు రాసినవారు?
     1) కందుకూరి వీరేశలింగం
     2) చిలకమర్తి లక్ష్మీనరసింహం
     3) గుడిపాటి వెంకటాచలం
     4) కొడవటిగంటి కుటుంబరావు
 
 సమాధానాలు
 1) 3    2) 4    3) 4    4) 2    5) 3
 6) 2    7) 1    8) 3    9) 2    10) 2
 11) 3    12) 3    13) 1    14) 1    15) 3
 16) 1    17) 3    18) 1    19) 4    20) 2
 21) 2    22) 1    23) 2    24) 1    25) 4
 26) 3    27) 2    28) 4    29) 3    30) 1
 31) 3    32) 2    33) 3    34) 4    35) 3    36) 3    37) 1    38) 3    39) 1    40) 2    41) 3    42) 4    43) 2    44) 1    45) 2
 46) 3    47) 1    48) 4    49) 2    50) 3    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement