పాలను వేడి చేయకుండా తాగితే వచ్చే వ్యాధి?
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో హార్మోన్లను ఉత్పత్తి చేయని భాగం?
ఎ) కాలేయం బి) క్లోమం
సి) బీజకోశాలు డి) బి, సి
2. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకుంటే వచ్చే వ్యాధి?
ఎ) డయాబెటిస్ ఇన్‌సిపిడిస్
బి) గ్లూకోసేమియా
సి) కీటోసిస్ డి) డయాబెటిస్ మెలిటస్
3. కంటిలో రొడాప్సిన్, ఐడాప్సిన్ అనే పదార్థాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్?
ఎ) సి బి) డి సి) ఎ డి) ఇ
4. విటమిన్లతో సంబంధం లేని వ్యాధి?
ఎ) గౌట్ బి) క్షయ
సి) మశూచి డి) పైవన్నీ
5. కిందివాటిలో పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
ఎ) క్వాషియార్కర్ బి) మరాస్‌మస్
సి) జీరాఫ్తాలియా డి) పైవన్నీ
6. అయోడిన్‌తో సంబంధమున్న అంతస్రావ గ్రంథి?
ఎ) పీయూష బి) అధివృక్క
సి) అవటు డి) క్లోమం
7. ఆల్ఫా, బీటా కణాలను కలిగి ఉన్న భాగం?
ఎ) కాలేయం బి) క్లోమం
సి) పిత్తాశయం డి) ప్లీహం
8. రక్తంలో ఉండాల్సిన చక్కెర శాతం?
ఎ) 70 mg/1ml బి) 160 mg/1ml
సి) 120 mg/1ml డి) 200 mg/1ml
9. హైపోథలామస్ శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది?
ఎ) గుండె బి) మూత్రపిండాలు
సి) మెదడు డి) క్లోమం
10. తల్లి పాలలో ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్?
ఎ) ఎ బి) సి సి) బి డి) ఇ
11. ఎండు చేపల్లో లభించే విటమిన్?
ఎ) డి బి) ఎ సి) ఇ డి) కె
12. విటమిన్-సి అధికంగా దేంట్లో లభ్య మవుతుంది?
ఎ) అంబ్లికా బి) సింఖోనా
సి) డాకస్ డి) మ్యూసా
13. ఎండుఫలాల్లో ఎక్కువగా లభించే మూలకం?
ఎ) ఐ బి) Na సి) K డి) Fe
14. గాయాలను మాన్చడం, విరిగిన ఎముకలను అతికించడంలో తోడ్పడే విటమిన్?
ఎ) ఎ బి) సి సి) బి డి) ఇ
15. ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పేర్కొంటారు?
ఎ) అధివృక్క బి) పార్శ్వ అవటు
సి) అవటు డి) పాంక్రియాస్
16. టిటాని వ్యాధితో సంబంధం ఉన్న అంతస్రావ గ్రంథి?
ఎ) పారాథైరాయిడ్ బి) థైరాయిడ్
సి) అడ్రినల్ డి) పిట్యూటరీ
17. నాడీవ్యవస్థకు అవసరమైన ూ్చ+ అయాన్ లను నియంత్రించే హార్మోన్ ఏది?
ఎ) ప్రొలాక్టిన్ బి) వాసోప్రెస్సిన్
సి) ఆల్డోస్టీరాన్ డి) కార్టిసోల్
18. మానవుడిలో మరుగుజ్జుతనానికి కారణమైన హార్మోన్ ఏది?
ఎ) పారాథైరాక్సిన్ బి) ఆక్సిటోసిన్
సి) వాసోప్రెస్సిన్ డి) థైరాక్సిన్
19. ఏఐగ వైరస్‌కు మరో పేరేమిటి?
ఎ) ఆర్థ్రో వైరస్ బి) పారామిక్సోవైరస్
సి) HTLV-III డి) HTLV-I
20. పాలను వేడి చేయకుండా తాగితే వచ్చే వ్యాధి?
ఎ) లెప్రసీ బి) ధనుర్వాతం
సి) కోరింతదగ్గు డి) క్షయ
21. ఏ విటమిన్ లోపం వల్ల ‘ఎనుచిసం’ అనే వ్యాధి వస్తుంది?
ఎ) ఇ బి) కె సి) ఎ డి) ఏదీకాదు
22. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి అయినప్పుడు జరిగే మార్పు?
ఎ) గ్లూకోజ్ గ్లైకోజన్‌గా మారుతుంది
బి) గ్లైకోజన్ గ్లూకోజ్‌గా మారుతుంది
సి)గ్లూకోజ్ కార్బోహైడ్రేట్‌గా మారుతుంది
డి) ఎ, బి
23. ఢిల్లీ బోయిల్స్ అనే వ్యాధిని వ్యాప్తి చేసేది?
ఎ) హౌస్ ఫ్లై బి) సాండ్ ఫ్లై
సి) సీ-సీ ఫ్లై డి) పైవన్నీ
24. కిందివాటిలో మధుమేహ దినం (Diabetes Day) ఏది?
ఎ) ఆగస్ట్ - 20 బి) డిసెంబర్ - 1
సి) నవంబర్ - 14 డి) మార్చి - 8
25. ప్రపంచ క్షయ దినం?
ఎ) మార్చి -14 బి) మార్చి - 24
సి) సెప్టెంబర్ - 20 డి) మే - 5
26. కిందివాటిలో ఏ అవయవం ప్రభావం వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది?
ఎ) కాలేయం బి) క్లోమం
సి) మూత్రపిండం డి) గుండె
27. డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నదెవరు?
ఎ) కోల్ఫ్ బి) రెనలానెక్
సి) రాబర్‌ట కోచ్ డి) జోల్
28. కిందివాటిలో ఖీఈ వ్యాధి కానిది?
ఎ) గనేరియా బి) సిపిలిస్
సి) క్షయ డి) పైవన్నీ
29. కిందివాటిలో భిన్నమైంది ఏది?
ఎ) రింగ్‌వార్‌మ బి) రౌండ్‌వార్‌మ
సి) హుక్‌వార్‌మ డి) ఎర్‌తవార్‌మ
30. వైరస్ అంటే అర్థమేమిటి?
ఎ) స్ఫటికం బి) జీవకణం
సి) విషపదార్థం డి) లవణం
31. బ్యాక్టీరియా ప్రతిసారి ఎన్ని పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది?
ఎ) 4 బి) 2 సి) 16 డి) అనేకం
32. మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది?
ఎ) 2 బి) 4 సి) 24 డి) 12
33. కిందివాటిలో అంటువ్యాధి కానిది?
ఎ) క్షయ బి) గజ్జి
సి) ఎయిడ్‌స డి) పైవన్నీ
34. చలిజ్వరం అని దేన్ని పిలుస్తారు?
ఎ) కలరా బి) టైఫాయిడ్
సి) క్షయ డి) మలేరియా
35. తెల్ల రక్తకణాల్లో ఏవి తక్కువ సంఖ్యలో ఉంటాయి?
ఎ) బేసోఫిల్స్ బి) న్యూట్రోఫిల్స్
సి) ఎసిడోఫిల్స్ డి) లింఫోసైట్స్
36. మొదటిసారిగా గుండె మార్పిడి చేసిందెవరు?
ఎ) విలియం హార్వే
బి) క్రిస్టియన్ బెర్నాల్డ్
సి) డబ్ల్యూజే కాఫ్
డి) పైన పేర్కొన్నవారెవరూ కాదు
37. కీటకాల్లో రక్త సరఫరా ఎన్ని గదుల ద్వారా జరుగుతుంది?
ఎ) 16 బి) 13 సి) 4 డి) 2
38. గుండె గదుల సంఖ్యకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) గద్ద -4, ఏనుగు-4, చేప-2, కప్ప-2
బి) ఏనుగు-3, కప్ప-3, చేప-2, గద్ద-4
సి) చేప-2, కప్ప-3, గద్ద-4, ఏనుగు-4
డి) చేప-3, కప్ప-4, గద్ద-3, ఏనుగు-2
39. రక్తవర్గాలను కనుగొన్నదెవరు?
ఎ) లాండ్ స్టీనర్ బి) విలియం హార్వే
సి) క్రిస్టియన్ బెర్నాల్డ్ డి) కురియన్
40. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది?
ఎ) 1900 బి) 1898
సి) 1902 డి) 1934
41. ఏ శిలీంద్రం వల్ల చెరకులో ఎర్రకుళ్లు తెగులు వస్తుంది?
ఎ) పిరుక్యులేరియా ఒరెజై
బి) స్పెసిలో థీకా సొర్గి
సి) కొలిటో ట్రైఖా ఫాల్కేటం
డి) ఏక్సీనియా ట్రిటిసి
42. అమీబియాసిస్ (జిగట విరేచనాలు) దేని వల్ల వస్తుంది?
ఎ) బ్యాక్టీరియా బి) వైరస్
సి) శిలీంద్రం డి) ప్రోటోజోవా
43. క్యాన్సర్‌ను కలుగజేసే వైరస్?
ఎ) ఆంకోజెనిక్ బి) పారామిక్సో
సి) వేరియోలా డి) రాబ్డి
44. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) ఆక్సిన్లు బి) జిబ్బరెలిన్లు
సి) సైటోకైనిన్లు డి) ఇథిలిన్
45. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాక్టీరియా దేని ద్వారా వృద్ధి చెందుతుంది?
ఎ) ద్విదావిచ్ఛితి బి) అంతఃసిద్ధబీజాలు
సి) సంయోగం డి) పైవన్నీ
46. గుండెలో ముఖ్యమైన కవాటం ఏది?
ఎ) మిట్రల్ బి) ట్రైకుస్‌పిడ్
సి) పెరికార్డియం డి) ఏదీకాదు
47. కపాలనాడుల సంఖ్య?
ఎ) 12 బి) 24 సి) 31 డి) 10
48. మానవ రక్తంలో ఎర్రరక్తకణాల ఉపయోగం?
ఎ) వ్యాధి నిరోధకత
బి) ై2, ఇై2 ల రవాణా
సి) రక్తం ఉత్పత్తి డి) హార్మోన్ల రవాణా
సమాధానాలు
1) ఎ; 2) డి; 3) సి; 4) డి; 5) డి;
6) సి; 7) బి; 8) సి; 9) సి; 10) ఎ;
11) బి; 12) ఎ; 13) డి; 14) బి; 15) సి;
16) ఎ; 17) సి; 18) డి; 19) సి; 20) డి;
21) ఎ; 22) ఎ; 23) బి; 24) ిసి; 25) బి;
26) ఎ; 27) ఎ; 28) సి; 29) ఎ; 30) సి;
31) బి; 32) బి; 33) సి; 34) డి; 35) ఎ;
36) బి; 37) బి; 38) సి; 39) ఎ; 40) సి;
41) సి; 42) డి; 43) ఎ; 44) బి; 45) బి;
46) ఎ; 47) బి; 48) బి
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
నేను ఆర్‌ట్స విద్యార్థిని. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాను. బయాలజీలో చదివిన అంశాలను మరచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- టి.తిరుమలేష్, వికారాబాద్.
బయాలజీ పాఠ్యాంశాలను చదవడం సులభమే. కాకపోతే కొన్ని క్లిష్టమైన అంశాలను గుర్తుంచుకోవడం కష్టతరమవుతుంది. సన్నద్ధమయ్యేటప్పుడు ప్రతి అంశాన్ని సాధారణీకరించుకొని చదివితే ఎక్కువకాలం గుర్తుంచుకునే అవకాశముంటుంది. ముందుగా మన చుట్టూ ఉన్న పరిసరాలు, జీవజాలం, మానవుడు, వీటి మధ్య ఉన్న సంబంధాలు, అవసరాలు మొదలైన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిని తెలుసుకొని తదనుగుణంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఉదాహరణకు జీవజాలం అనే అంశాన్ని తీసుకుంటే.. దీనిపై ఏ స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి, వాటికి తగినట్లుగా జీవజాలం పుట్టుక నుంచి జీవపరిణామం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మొదటగా పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ వరకు ఉన్న జీవశాస్త్ర పాఠ్యపుస్తకాలను చదివి మౌలికాంశాలపై పట్టు సాధించాలి.
చదివేటప్పుడే క్లిష్టంగా ఉన్న అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సంఖ్యా సంబంధ అంశాలను ఏదో ఒక అంశంతో పోల్చుకొని గుర్తుంచుకుంటే మరచిపోవడానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకు వరిలో క్రోమోజోముల సంఖ్య ఎంత? అంటే దీనికి సమాధానం 24. రోజూ మనం ఎక్కువగా అన్నం (వరి)ను ఆహారంగా తీసుకుంటాం. రోజుకు 24 గంటలు. దీని ఆధారంగా వరిలోని క్రోమోజోముల సంఖ్య 24 అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలను స్వతహాగా కొన్ని వందల సంఖ్యలో గుర్తుంచుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సులభంగా సమాధానం గుర్తించవచ్చు.
- తాటికొండ సుధాకర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ,
హైదరాబాద్.