
వైఎస్సార్‌సీపీలోకి గోపాల్‌రెడ్డి
హైదరాబాద్: ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిని. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షునిగా, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిశాను. ఉద్యోగుల విషయంలో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు.
ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు. తొమ్మిదో పీఆర్సీ సమయంలో గరిష్టంగా ఐఆర్ ఇచ్చారు. తన తండ్రి తరహాలో ఉద్యోగులను సొంత కుటుంబసభ్యులుగా చూసుకుంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్ కుటుంబం.. మేనిఫెస్టోను అమలు చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా నేను పార్టీలో చేరాను. పార్టీ విజయానికి ప్రచారం చేస్తా’’ అని ఆయన తెలిపారు