టిడిపి రెబల్ అభ్యర్థిపై దాడి | Attack on TDP rebel Candidate | Sakshi
Sakshi News home page

టిడిపి రెబల్ అభ్యర్థిపై దాడి

Published Tue, May 6 2014 8:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Attack on TDP rebel Candidate

గుంటూరు: గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం  టీడీపీ రెబల్ అభ్యర్థి అల్లా బక్ష్‌పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో అల్లా బక్ష్‌  తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు వెనక నుంచి వచ్చి దాడి చేసి పరారయ్యారు. గాయపడిన అల్లా బక్ష్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దుండగులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున మద్దాల గిరిధర్ పోటీలో ఉన్నారు. అల్లా బక్ష్‌ టిడిపి టికెట్ తనకే లభిస్తుందని ఆశించారు. తనకు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరపున ముస్తఫా పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement