ఉప్పొంగిన అభిమానం
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి రెండో రోజూ అపూర్వ స్పందన లభించింది. ప్రజలు అడుగడుగునా ఆమెకు నీరాజనం పలికారు. సోమవారం రాత్రి ఆత్మకూరు పర్యటన ముగించుకున్న షర్మిల రాత్రి పొదలకూరులో బస చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు భారీ జనసందోహం మధ్య పొదలకూరు నుంచి రెండో రోజు పర్యటన ప్రారంభించారు.
పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత అనే తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి షర్మిలపై అభిమానం చాటుకున్నారు. పొదలకూరు నుంచి వెంకటగిరి వరకు దారిపొడవునా ఆమెకు విశేష ఆదరణ లభించింది. వెంకటగిరిలో షర్మిలను పలకరించేందుకు జనం పోటీపడ్డారు. అక్కడ రోడ్‌షోకు గంటల కొద్ది సమయం పట్టింది. మధ్యాహ్నం 12 గం టలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంత రం నాయుడుపేటకు బయలుదేరారు.
నాయుడుపేటలోనూ జనం తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా ఆమెపై పూలవర్షం కురిపిం చారు. షర్మిల అందరినీ నవ్వుతూ పలకరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ ముం దుకు సాగారు. ప్రస్తుతం జరగనున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు నాయుడుపేట సభలో మాట్లాడిన అనంతరం సూళ్లూరుపేటకు చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజ లతో సూళ్లూరుపేట జనసంద్రంగా మారింది.
ఫ్యాను గుర్తును మరవకండి,
వైఎస్‌ను గుర్తుంచుకోండి..
‘అమ్మలారా..అక్కలారా..అన్నలారా.. తమ్ము లారా..ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తును మరువకండి.వైఎస్‌ను గుర్తుంచుకోండి..మీ ఓటుతో వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని చాటండి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో చరిత్రాత్మక అధ్యాయాన్ని సృష్టించిన రాజన్న పాలనను జగనన్న తిరిగి అందిస్తారు’ అంటూ ప్రతి సభ, రోడ్‌షోలో షర్మిల భావోద్వేగ మాటలకు ప్రజల నుంచి ఉవ్వెత్తున స్పందన లభించింది.
ఆకట్టుకున్న ప్రసంగం
షర్మిల ఎన్నికల ప్రచార ప్రసంగాలు రెండో రోజు ప్రజలను మరింత ఆకట్టుకున్నాయి. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిలా కాక రాష్ట్ర ప్రజలను కన్న తండ్రిలా చూసుకున్నారన్నారు. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందిం చారు. వైఎస్ మా దేవుడంటూ నినదించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్సార్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి పరిపూర్ణంగా అమలు చేశారన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించారన్నారు. ఎందరో విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. రాజన్న రాజ్యంలో రైతన్నలకు కష్టాలే లేవని, ఆ మహానేత మృతితో కష్టాలు వచ్చాయన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇప్పుడు ఆయనకు మళ్లీ అవకాశం ఇస్తే చంద్రగ్రహణం తప్పదన్న షర్మిల మాటలకు జనం ఈలలు, కేకలతో స్పందించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు, కిరణ్‌లే కారణమని షర్మిల మాట్లాడిన సమయంలోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విభజన పాపంలో కాంగ్రెస్, టీడీపీతో పాటు బీజేపీ పాలుపంచుకున్నాయని ఆమె ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడింది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనన్నారు. వైఎస్సార్‌సీపీకి అత్యధిక స్థానాలు ఇస్తే దేశ ప్రధానిని మనమే నిర్ణయిద్దామని షర్మిల ఇచ్చిన పిలుపు జనంలో మరింత ఉత్సాహం నింపింది.
జగన్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అప్పట్లో మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్, వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.