పోలింగ్ బూత్‌లో సెల్‌ఫోన్ నిషేధం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఈ నెల 30న జరుగునున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది సెల్‌ఫోన్‌లను వినియోగించరాదని కలెక్టర్ స్మి తా సబర్వాల్ తెలిపారు. బుధవారం మున్సిప ల్ సమావేశ మందిరంలో ప్రొసిడింగ్, అసిస్టెం ట్ ప్రొసిడింగ్ అధికారులకు ఈవీఎంల నిర్వాహణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల మేరకు సెల్‌ఫోన్‌ల వినియోగా న్ని నిషేధించినట్లు తెలిపారు. పోలింగ్ కేం ద్రాల్లో విధులు నిర్వహించే పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులకు మాత్రమే సెల్‌ఫోన్‌లు వినియోగించాలన్నారు.
ఈవీఎంల బ్యాటరీ చార్జింగ్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైన ఇబ్బంది ఉంటే ఆర్‌ఓ(రిటర్నింగ్ ఎన్నికల అధికారి) సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ఎవరైనా బెదిరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ పద్ధతి లో అన్ని పోలింగ్ కేంద్రాలను స్వయంగా తా ను పరిశీలిస్తానని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా పోలింగ్ అధికారి ఓటర్ లేని సమయంలో ఈవీఎం దగ్గరికి వెళ్లి పరిశీలించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే జెడ్ క్యాటగిరీ ప్రముఖుల సెక్యురిటీ గార్డ్‌లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి సాయిలుతో పాటు పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఓటరుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
సదాశివపేట: ఎన్నికల్లో ఓటు వేసే ఓటరు తప్పనిసరిగా గుర్తింపుకార్డుతో పోలింగ్ కేంద్రానికి రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించా రు. బుధవారం సదాశివపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశ మందిరం నిర్వహిస్తున్న ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్‌కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డులతో పాటు ప్రభుత్వం ప్రకటించిన గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తప్పని సరిగా తీసుకుని రావాలన్నారు. పట్టణంలో 29,255 మంది ఓటర్లు ఉన్నారని, పట్టణ పరి ధిలో 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు ప్రశాం తంగా జరిగేలా సహకారించాలని కోరారు.