కేశినేని నానికి ముఖం చాటేసిన బాబు! | chandrababu naidu not interested to meet Kesineni Nani | Sakshi
Sakshi News home page

కేశినేని నానికి ముఖం చాటేసిన బాబు!

Published Mon, Apr 14 2014 10:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

కేశినేని నానికి ముఖం చాటేసిన బాబు! - Sakshi

కేశినేని నానికి ముఖం చాటేసిన బాబు!

హైదరాబాద్: కేశినేని నానికి మరోసారి చుక్కెదురు అయ్యింది.  విజయవాడ ఎంపీ టికెట్ వ్యవహారంపై ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసేందుకు  సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో నాని వెనుదిరిగారు. ఓ గంట తర్వాత నాని ....చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాని నిన్న కూడా చంద్రబాబును కలిసేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు.

ఈ సందర్భంగా బెజవాడ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని నాని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే టికెట్ విషయంలో ఒత్తిడి ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాంతో బెజవాడ టికెట్ దక్కకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేశినేని నాని యోచిస్తున్నట్లు సమాచారం. తాను అసెంబ్లీకి పోటీ చేసే ప్రసక్తే లేదని....ఎంపీగానే బరిలోకి దిగుతానని కేశినానే నాని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేశినేని నానికి టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు విజయవాడలో ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement