హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ జగన్ | chandrababu naidu's horrors regime : YS Jagan | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ జగన్

Published Thu, Mar 27 2014 8:43 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించుకుందాం:వైఎస్ జగన్

విశాఖపట్నం: హైదరాబాద్ను మించిన మహానగరాన్ని నిర్మించుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. తగరపువలసలో జరిగిన వైఎస్ఆర్ సిపి జనపథం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భయానకపాలన ఉండేదన్నారు. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాలు ఉంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చంద్రబాబు చెబుతున్నారన్నారు. దొంగ హామీలు ఇచ్చిన చంద్రబాబును జైలులో పెట్టాలన్నారు.  ఇంత అన్యాయంగా ఉన్న తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు ఎందుకు వేయించారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

రాజకీయమంటే పేదవాడి మనసు ఎరగాలన్నారు.  వైఎస్ఆర్ చిరునామా ఎక్కడ అని అడిగితే ప్రతి ఒక్కరి గుండెలోతుల్లోఉన్నారని చూపిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ పాలన విశ్వసనీయత గల పాలన అని జగన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement