ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం | Chaos in the distribution of voter slips | Sakshi
Sakshi News home page

ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం

Published Mon, May 5 2014 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chaos in the distribution of voter slips

* స్లిప్పు పుస్తకాలు తీసుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలు
* బీఎల్వోలను బెదిరించి వారే పంపిణీ చేస్తున్న వైనం
* చోద్యం చూస్తున్న రిటర్నింగ్ అధికారులు
 

 సాక్షి, చిత్తూరు: టీడీపీ, కాంగ్రెస్ నాయకుల జోక్యంతో ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదా పు 30 లక్షల మంది ఓటర్లకు స్లిప్పులు ఇచ్చే బాధ్యతను ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించింది. రెండు రోజుల నుంచి వార్డుల్లో, పోలింగ్‌బూత్ పరిధిలో ఆయా బీ ఎల్వోలు(బూత్‌లెవల్ ఆఫీసర్లు) ఇంటింటికీ వెళ్లి స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క బూత్‌కి ఒక్కొక్కరు చొప్పున 3,281 మంది బీఎల్వోలను ఏర్పాటు చేశారు.

 తెలుగుదేశం, కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర పార్టీ నాయకు లు జోక్యం చేసుకుంటుండడంతో వారి విధుల కు ఆటంకం కలుగుతోంది. చిత్తూరు, కుప్పం, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో బీఎల్వోల నుంచి ఓటరు స్లిప్పుల పుస్తకాలు లాక్కుని వాటితోపాటు పార్టీని సింబ ల్స్‌ను ప్రచారం చేసుకుంటున్నారు. మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో జై సమైక్యాం ధ్ర పార్టీ వారు ఓటరు స్లిప్పు పుస్తకాలు తీసుకుని నింబంధనలకు విరుద్ధంగా పంచుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.

 చోద్యం చూస్తున్న ఆర్వోలు
 బూత్ లెవల్ ఆఫీసర్ల వద్ద నుంచి ఓటరు స్లిప్పు పుస్తకాలను రాజకీయ పార్టీల నాయకు లు దౌర్జన్యం చేసి తీసుకెళ్తున్నా పోలీసు చర్యలు లేవు. ఆయా అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు పట్టించుకోవటం లేదు. చాలాచోట్ల టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ కే.రాంగోపాల్ స్పందించాల్సి ఉంది.

 పంపిణీలో జాప్యం
 ఓటరు స్లిప్పుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. బూత్ లెవల్ అధికారులు ఒక్కరే ఒక్కొక్క బూత్‌లో తిరిగి పంచాల్సి రావడంతో చాలాచోట్ల జాప్యం తప్పడం లేదు. కొన్నిచోట్ల చిరునామాలోని వ్యక్తులు లేకపోవటంతో మళ్లీ వారిని సంప్రదించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మహిళా ఉద్యోగులను నియమించటంతో టీడీపీ, కాంగ్రెస్, జేఎస్పీ నాయకులు వారిని బెదిరించి ఓటరు స్లిప్పు పుస్తకాలు తీసుకెళుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement