ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు: హరీష్‌రావు
సంగారెడ్డి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంతా అంధకారమేనని, ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోస్టర్ మీద చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీవాళ్లే ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగారని అన్నారు.
చంద్రబాబు మనిషిని మార్చవచ్చుగాని.. తెలంగాణ ప్రజల మనసు మార్చలేరని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ల కోసమే పోటీ చేస్తోందని, అయినా ఎక్కడా రావని అన్నారు. తెలంగాణలో టీడీపీకి మూడు సీట్ల కంటే ఎక్కువ రావని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి , సీమాంధ్ర నాయకుల నోట్ల కట్టల మధ్య జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు.