తండ్రి అనారోగ్యం కారణంగా తనయుడికి టికెట్ | Due to illness of Father, ticket allotted to son | Sakshi
Sakshi News home page

తండ్రి అనారోగ్యం కారణంగా తనయుడికి టికెట్

Published Mon, Apr 14 2014 4:57 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Due to illness of Father, ticket allotted to son

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు శాసనసభ స్థానంను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట  చెన్నకేశవరెడ్డి కుమారుడు  ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించింది. ఈ స్థానం నుంచి మళ్లీ చెన్నకేశవరెడ్డే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే చెన్నకేశవరెడ్డికి అనారోగ్యం కారణంగా తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఈ స్థానాన్ని కేటాయించారు.

ఎమ్మిగనూరు శాసన సభా స్థానానికి గతంలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రకోట చెన్న కేశవరెడ్డి 20,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా ఆయన మూడవ సారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం తరపున బివి మోహనరెడ్డి పోటీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement