భావ్‌నగర్: భిన్న మతాల మధ్య విద్వేషానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసిన విశ్వహిందూ పరిష త్ నేత ప్రవీణ్ తొగాడియాపై గుజరాత్‌లోని భావ్‌నగర్ పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హిందువులు అధికంగా ఉన్న ఓ ప్రాంతం లో ముస్లిం వ్యాపారి కొన్న ఇంటిని బలవంతంగా ఆక్రమించుకోవాలని తొగాడియా పిలుపునివ్వడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకుంటే బలవంతంగా స్వాధీనం చేసుకుని, భజరంగ్‌దళ్ పేరుతో బోర్డు తగిలించాలని తొగాడియా సూచించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.దీంతో తొగాడియాపై సెక్షన్ 153 (ఎ), సెక్షన్ 153(బి)తోపాటు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందున సెక్షన్ 188 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సోలంకి వెల్లడించారు. తొగాడియా వీడియోలను పరిశీలిస్తున్నామని... ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి.
గిరిరాజ్‌పై నిషేధం: ఎన్నికల తర్వాత మోడీ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్‌పై ఈసీ నిషేధం విధించింది. బీహార్, జార్ఖండ్‌లలో ప్రచా రం నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, తొగాడియా, గిరిరాజ్ వ్యాఖ్య లను ఖండిస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ మేలు కోరేవారని చెప్పుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్నారు.
తొగాడియాపై ఎఫ్‌ఐఆర్
Published Wed, Apr 23 2014 4:13 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement