
నేను దూకేస్తా..!
గుసగుసలు: తాజా మాజీ మంత్రి ఒకరు మై హూనా.. అంటున్నారు! పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ వూజీ మంత్రి మాజీ సీఎం ఏర్పాటు చేసిన పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. నిన్నమొన్నటి వరకు ఎవరైనా సీఎంపై ఒక్కమాటన్నా... ఈయనగారు అంతెత్తులేచేవారు. కానీ ఇప్పుడు వూజీ సీఎంతో అంటీవుుట్టనట్టుగా ఉంటు న్నారు. ఇంతకీ సంగతేంటంటే... ఈ వూజీ వుంత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేయూలని అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు భావించారు. అందుకు కాంగ్రెస్‌లో ఉంటే లాభం లేదనుకున్నారు. టీడీపీలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన జిల్లాకే చెందిన బీజేపీ నేత సహకారంలో చంద్రబాబు కోటరీలోని నేతను కలిసి చర్చలు జరిపారు. పార్టీలో చేరుతాను టికెటివ్వాలని ప్రతిపాదించారు.
ఈ విషయం తెలియుడంతో మాజీ మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే టీడీపీ కోటరీ నేత ఒకరికి ఫోన్ చేసి... ‘‘వేరే నియోజకవర్గం నేతను నా నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? మీకంతగా అభ్యర్థులు దొరక్కపోతే నేను లేనా...! నన్ను రమ్మంటే నేను మీ పార్టీలోకి రానా..?’’ అని అన్నార్ట! ‘‘మీరు ఎప్పుడు గోడ దూకమంటే అప్పుడు గోడ దూకుతా..’’ అని కబురుపెట్టి హాయిగా ఇంట్లో కూర్చున్నారట!! పనిలో పనిగా పార్టీ మారాల్సిందేనంటూ సొంత కార్యకర్తలతో తన ఇంటి వుుందే ధర్నా కూడా చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ నేత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఏదైతేనేం... తన నియోజకవర్గంలో మరో కాంగ్రెస్ నేతను అడ్డుకునేందుకు సదరు వూజీ వుంత్రి మాజీ సీఎంకు దూరం జరిగారు.