సాక్షి, నెల్లూరు: మే 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బుధవారం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు విస్తృతంగా దాఖలయ్యాయి. ఒక్క రోజే అసెంబ్లీ స్థానాలకు 30 నామినేషన్లు దాఖలు కాగా, నెల్లూరు పార్లమెంటుకు ఒకటి, తిరుపతి పార్లమెంటుకు 2 వంతున నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వరప్రసాదరావు, డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడు నవీన్‌గుప్తా నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి తమ నామినేషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీ స్థానాలకు..
ఠ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముంగమూరు కృష్ణచైతన్య, ఎస్‌కే మహ్మద్ ఆలీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా అద్దేపల్లి గీత నగర కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నల్లమల నాగ ఆంజనేయులు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించారు.
కావలి నియోజకవర్గం నుంచి వైఎసార్‌సీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి ఆదిలక్ష్మి, మరో డమ్మీ అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, బీఎస్‌పీ అభ్యర్థిగా గుంజి వెంకటేశ్వర్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గోరంట్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతాల వెంకట్రావు కావలి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు అందజేశారు.
కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు వెంకటరమణ, టీఈపీ డమ్మీ అభ్యర్థిగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డి కోవూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు అందజేశారు.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు పరిచారు.
సూళ్లూరుపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య, డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి సుభాషిణి సూళ్లూరుపేట తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
ఉదయగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెంచలబాబుయాదవ్, టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని వెంకటరామారావు, లోక్‌సత్తా అభ్యర్థిగా ఎం.అంకయ్యచౌదరి ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు అందజేశారు.
ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతంరెడ్డి నామినేషన్ వేశారు.
గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనబాక కృష్ణయ్య రెండు సెట్లు, పి. నాగరాజు రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
వెంకటగిరి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడు, డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి ప్రమీలాదేవి, సీపీఎం అభ్యర్థిగా కటికాల వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ తమ నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
నామినేషన్ల హోరు
Published Thu, Apr 17 2014 4:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement