చదువుల కల చెదురుతోంది.. | Higher studies to be closere every poverty student: Ys rajashekar reddy | Sakshi
Sakshi News home page

చదువుల కల చెదురుతోంది..

Published Fri, Mar 21 2014 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

చదువుల కల చెదురుతోంది..

చదువుల కల చెదురుతోంది..

 ‘ఉన్నత చదువులు ‘ఉన్న’వారికే పరిమితం కాకూడదు.. చదువుకునే పేద విద్యార్థికి ఫీజులు భారం కావద్దు.. డాక్టర్, ఇంజినీర్ వంటి చదువులు అన్ని వర్గాలకు దక్కాలి!’
 - డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
 
 వైఎస్ హయాంలో..
 2008-09లో మారిన దశ
 *    ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టారు.
 *     పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులు, మెస్ చార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేయించారు.
 *     బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ.386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34 కోట్ల మేర విడుదల చేశారు.
 *     2005-06లో రూ.409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74  కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు.
 *     విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకాన్ని ప్రారంభించారు.
 *     ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు.
 *     2008-09 బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు.
 *     2009-10 బడ్జెట్‌లో రూ.2,333.04కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి.
 
 (పోలంపెల్లి ఆంజనేయులు)

 వైఎస్ సీఎం కాకముందు: ఉన్నతవిద్య మార్కెట్ వస్తువు. కొనుక్కుంటేనే దొరికేది. పేద విద్యార్థులకు అందని ద్రాక్ష. ఆశ, ఆసక్తి, అర్హత ఉన్నా.. ఆర్థిక భారంతో ఆ దిశగా ఆలోచించలేని అశక్తత వారిది.
 వైఎస్ సీఎం అయ్యాక: పేద విద్యార్థులందరికీ, వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండానే, వారు కోరుకున్న ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్‌‌సమెంట్ పథకాన్ని ప్రారంభం. లక్షలాది విద్యార్థుల భవితకు బంగారు బాటలు.
 వైఎస్ మరణానంతరం: పాలకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాశక్తి నీరుగార్చారు. అడ్డగోలు నిబంధనలతో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకే విద్యార్థులు భయపడేలా చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్నచూపే.
 
 వైఎస్‌ను మర్చిపోలేను..
 మాది నిరుపేద నేత కుటుంబం. నాన్న లక్ష్మీనారాయణ చిన్న కిరాణకొట్టు నడుపుతూ నన్ను చదివించారు. అమ్మ బీడీలు చుడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేద్దామనుకుంటున్న సమయంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నాలో చదువుకోవాలన్న ఆశను బతికించింది. దాంతో కరీంనగర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశా. సిరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ట్రెనింగ్‌లో ఉన్నా. ఎంటెక్ చేసి లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా కోరిక. రీయింబర్‌‌సమెంట్ పథకం లేకుంటే  నా భవిష్యత్ ఏమై పోయేదో తలచుకుంటేనే భయమేస్తుంది. వైఎస్‌ను ఎన్నటికీ మర్చిపోలేను.    
 - గోనె లావణ్య, పద్మనగర్, సిరిసిల్ల
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు
  అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం
  చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడమే లక్ష్యం.
 *     వైఎస్‌ఆర్ ప్రారంభించిన శాచ్యురేషన్(ప్రతి విద్యార్థికీ అందించే) పద్ధతి అమలు
 *    బడ్జెట్ పరిమితులు ఉండబోవు. భారమెంతైనా పథకాన్ని అమలు చేసి తీరడం.
 *    ఈ విషయాన్ని ఇటీవల జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  
 
 రోశయ్య, కిరణ్‌ల పాలనలో..
 భారం తగ్గించుకునే లక్ష్యంతో ఆధార్ కార్డు, బయోమెట్రిక్ విధానం.. తదితర కొత్త నిబంధనలతో పథకానికి తూట్లు పొడిచారు.
  *    2009-10 బడ్జెట్‌లో వైఎస్ ప్రభుత్వం రూ.2,333.04 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటుకు కేటాయిస్తే, వైఎస్ మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి చేబట్టిన రోశయ్య కేవలం రూ.1686.19 కోట్లు మాత్రమే విడుదల చేసి, లక్షలాది మంది విద్యార్థులకు మొండిచేయి చూపారు. అప్పటినుంచి కొత్త బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పాత సంవత్సరం తాలూకు బకాయిల చెల్లింపులకు ఖర్చు చేస్తూ వస్తున్నారు.
 *     2010-11లో రూ.2726 .04 కోట్లు బడ్జెట్‌లో కేయించినా, విడుదలైన మొత్తం రూ.997 కోట్లు మాత్రమే. ఇవి కూడా పాత బకాయిలకే సరిపోయాయి.
 *     2011 వచ్చే సరికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాల్సి వచ్చింది. అయితే 2011లో అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి 2011-12 బడ్జెట్‌లో రూ.2,913 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు  విడుదల చేశారు.
 ఈ మొత్తం పాత బకాయిలకే పోగా, 2012-13 విద్యా సంవత్సరంలో కేటాయించిన రూ.3,621 కోట్ల బడ్జెట్ నుంచి దాదాపు రూ.3,000 కోట్లు అంతకు ముందు విద్యా సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సి వచ్చింది.
 * 2013-14 (ప్రస్తుత) సంవత్సరానికి కేటాయించిన రూ.4,282 కోట్ల నుంచి పాత బకాయిలు సర్దారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల నమోదు సంఖ్య తగ్గింది.
   *   ఈ సంవత్సరం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న 26.58 లక్షల మందికి రూ. 4,500 కోట్లు అవసరమవుతాయి. మార్చి 31లోగా బడ్జెట్ విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు.
 *     మొత్తం 26.58 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 15.81 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అదీ లోపభూయిష్టంగా ఉంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు రూ.1,800 కోట్లు మాత్రమే. వాటిలో  రూ.1,350 కోట్లకు బిల్లులు తయారైనట్టు అధికారులు చెపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement